Cheetah Attack On Model : పులుల బోనులో మోడల్ ఫొటోషూట్..చీరి పడేసిన చిరుతలు

చిరుతలు ఉన్న బోనులోకెళ్లి ఓ మోడల్ ఫోటోషూట్ చేస్తుండగా రెండు చిరుతలు ఆమెపై దాడిచేశాయి. దీంతో ఆమెను హెలికాప్టర్ లో హాస్పిటల్ కు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది.

Cheetah Attack On Model : పులుల బోనులో మోడల్ ఫొటోషూట్..చీరి పడేసిన చిరుతలు

Photoshoot In A Cage Cheetah Attack On A Model 2

Updated On : August 27, 2021 / 12:05 PM IST

Photoshoot in a cage Cheetah attack on a model : ఒకప్పుడు ఫోటో తీయించుకోవటమే అబ్బరంగా ఉండేది.కానీ ఇప్పుడు ఫోటోషూట్ లు సర్వసాధాణంగా మారిపోయాయి. పుట్టినరోజులకు, పెళ్లిళ్లకు ఫోటో షూట్ లో హడావిడి పెరిగింది.దీని కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు. యాంకర్లు,మోడళ్లు, సెలబ్రిటీలు ఇలా ప్రతీదానికి ఫోటో షూట్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఓ మోడల్ ఫోటో షూట్ కోసం చిరుత పులుల బోనులో దూరింది. ఫోటో షూట్ చేస్తుండగా రెండు చిరుతలు ఆమెపై దాడికి చేశాయి. ఈ ఘటనలో ఆమెకు గాయాలైన ఘటన జర్మనీలోని ప్రైవేటు ప్రాపర్టీలో ఫొటోషూట్ లో జరిగింది.

జంతు ప్రేమికురాలిగా పాప్యులర్ అయిన జర్మనీ 36 ఏళ్ల మోడల్ జెస్సికా లేడాల్ఫ్‌పై ఫోటోషూట్ చేస్తుండగా చిరుతలు దాడి చేశాయి. తూర్పు జర్మనీలోని నెబ్రాకు జెస్సికా చెందిన బిర్గిట్ స్టేచ్ అనే 48 ఏళ్ల మహిళ ఒక జంతువుల షెల్టర్ నడుపుతోంది. స్వతహాగా జంతు ట్రైనర్ అయినా ఆమె.. అడ్వర్‌టైజింగులకు, షోలలో కొన్నాళ్లు ఉపయోగించి ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేసిన జంతువులను బిర్గిట్ షెల్టర్‌లో పెంచుతుంది. అలా ఆమె దగ్గరకు ట్రాయ్, పారిస్ అనే రెండు చిరుతలు రాగావాటిని కూడా పెంచుతోంది. ఈక్రమంలో చిరుతలు ఉన్న బోనులోకి వెళ్లిన జెస్సికా ఫొటోషూట్‌ ప్రారంభించింది. దీంతో చిరుతలకు తిక్కలేచిందో ఏమోగానీ..జెస్సికాపై దాడి చేశాయి.

దీంతో ఆమెను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని..ఆమె శరీరంపై గాట్లు ఇంకా తగ్గలేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై మోడల్ జెస్సికా మాట్లాడుతు..షూట్ జరిగే సమయంలో చిరుతల నా బుగ్గలు, చెవి, తలను కొరుకుతూనే ఉన్నాయి తాపీగా చెబుతోంది.

కాగా..ఈ ఈ ఫొటోషూట్ ఎవరు నిర్వహించారు? అనేది తెలియరాలేదు. కానీ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని..ప్రజలకు ఎటువంటి ఆందోళన పడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. ఈ దాడి చేసిన రెండు చిరుతలు కొన్ని వ్యాపార ప్రకటనల్లో కనిపించినట్లుగా సమాచారం.