Gold Mining : కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి
బంగారు గనిలో జరిగిన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సుడాన్‌లో జరిగింది

Gold Mining
Gold Mining : ఆఫ్రికా దేశం సుడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ కొర్డోఫాన్ ప్రావిన్స్‌లో బంగారం గనిలో తవ్వకాలు చేస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించినట్లు సమాచారం. మూసి ఉన్న గనిలో కొందరు అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దేశ మైనింగ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి సంబందించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది మైనింగ్ కంపెనీ. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. రెండు ప్రొక్లైనర్లతో మట్టిని తొలగిస్తున్నట్లు తెలిపారు అక్కడి అధికారులు.
చదవండి : Sudan PM : సూడాన్ ప్రధానమంత్రిని అరెస్ట్ చేసిన సైన్యం
సుడాన్‌కు బంగారం ఎగుమతి నుంచే అధిక ఆదాయం వస్తుంది. ఈ దేశంలో బంగారం గనులు అధికంగా ఉంటాయి. అధికారిక లెక్కల ప్రకారం సుడాన్ దేశం ఆఫ్రికా ఖండంలో బంగారం ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉంది. అయితే స్మగ్లింగ్ నేపథ్యంలో అక్రమ బంగారం వెలికితీతను నియంత్రించడం ప్రారంభించింది. రెండేళ్ల క్రితం ఇప్పుడు ప్రమాదం జరిగిన గనిని ప్రభుత్వం మూసివేసింది. అయితే స్థానికులు అక్రమంగా గనిలో తవ్వకాలు చేపడుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ గని సుడాన్ రాజధాని నగరం ఖార్టూమ్ 700 కిలోమీటర్ల దూరంలో ఫుజా అనే గ్రామం వద్ద ఉంది.
చదవండి : Myanmar : కొండచరియలు విరిగిపడి 80 మంది గల్లంతు