Myanmar : కొండచరియలు విరిగిపడి 80 మంది గల్లంతు

మయన్మార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండగా కొండచరియలు విరిగిపడ్డాయి.

Myanmar : కొండచరియలు విరిగిపడి 80 మంది గల్లంతు

Myanmar

Myanmar : మయన్మార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 80 నుంచి 100 మంది గల్లంతై ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఒకరి మృతదేహం వెలికితీయగా.. మిగతా వారికోసం సైన్యం గాలింపు చేపట్టింది. ప్రమాదం జరిగిన జాడే గని.. ప్రపంచంలోనే పెద్ద గనుల్లో ఒకటి. ఇది అత్యంత ప్రమాదకర గనిగా చెబుతుంటారు. గతంలో ఇదే గనిలో జరిగిన ప్రమాదంలో 120 మంది మృతి చెందారు.

చదవండి :  Kinnaur Landslide : కొండచరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది మృతి..వీడియో

ప్రమాదకర గని కావడంతో ప్రభుత్వం దీనిని మూసివేసింది. అయితే ప్రజల ఆర్ధిక పరిస్థితి సరిగా లేకపోవడం, కరోనా మహమ్మారి వచ్చి పడటంతో తినడానికి కూడా తిండిలేక అక్రమంగా గని తవ్వకాలు చేపట్టి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొండచరియలు విరిగిపడటంతో మట్టి పెల్లల కింద చాలామంది చిక్కుకు పోయారు. గల్లంతైన వారిలో చాలామంది మృతి చెంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. గాలింపు పనులు వేగంగా సాగుతున్నట్లు వివరించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో గాలింపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

చదవండి : Landslide : హిమాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ విరిగిపడ్డ కొండ చరియలు…శిథిలాల కింద 80 మంది