Heartbreaking : 48 కోట్ల జంతువులు మంటలకు ఆహుతి

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 01:54 AM IST
Heartbreaking : 48 కోట్ల జంతువులు మంటలకు ఆహుతి

Updated On : January 4, 2020 / 1:54 AM IST

నిజంగానే ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఆస్ట్రేలియాలో చెలరేగిన మంటల్లో 480 మిలియన్ల జంతువులు చనిపోయానని సిడ్నీ విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటిలో పక్షులు, క్షీరదాలు, పాకే జంతువులున్నాయి. న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్‌లో సెప్టెంబర్ నుంచి మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కంగారులు మంటల్లో కాలిపోయిన దృశ్యాలు కంటతడిపెట్టేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. 

 

ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతంలో అడవుల్లో మంటలు దావానంలా వ్యాపిస్తున్నాయి. ఎండలు విపరీతంగా ఉండడంతో మంటలు చెలరేగుతున్నాయి. దీని కారణంగా దట్టంగా పొగ అలుముకొంటోంది. లక్షలాది ఎకరాల అడవి బూడిదవుతోంది. అడవుల్లో ఉంటున్న జంతువులు ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీస్తున్నాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా..అవి విఫలమౌతున్నాయి. దీని కారణంగా అనేక జంతువులు కాలిపోతున్నాయి. 

భారీ సంఖ్యలో అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్ల సహాయంతో నీరు చిమ్ముతున్నారు. జంతువులను రక్షించేందుకు వాలంటీర్లు రంగంలోకి దిగారు. వాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన జంతువులకు చికిత్స అందిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 

విక్టోరియా నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేల మంది బీచ్‌ల వద్ద తలదాచుకుంటున్నారు. కార్చిచ్చు వల్ల సెప్టెంబర్ నుంచి 18 మంది చనిపోయారు. చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. గత అక్టోబర్ నుంచే మంటలు మొదలయ్యాయని, వీటి ధాటికి ముగ్గురు వాలంటీర్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అనేక పట్టణాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో గాడాంధకారం అలుముకుంది. అనేక మంది ఇళ్లు, ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఎండిపడిన ఆకులకు మంటలు అంటుకుని చెట్ల పొదలు, గుబుర్లు కాలిపోతాయి. పొదల్లో నివాసం ఉండే జంతువులకు ప్రాణహాని కలుగుతోంది. మరి ఈ మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చూడాలి. 

Read More : WhatsApp రికార్డు : కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందు