ఈ 5 లక్షణాలు ఉన్నాయా? మీ ఎమోషనల్ హెల్త్ ప్రమాదంలో ఉన్నట్టే!

ఏదైనా విషయంలో లేదా పనిలో ఒత్తిడి, ఆందోళన, నిరాశకు గురి అవుతున్నారంటే మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మీ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం చాలా అవసరం. అంతేకాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటు, మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం వల్ల మీరు పనులను సరిగ్గా నిర్వర్తించగలుగుతారు. అదే మీ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా, ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయినా మీ ఆరోగ్యం పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమా ?
న్యూఢిల్లీకి చెందిన ప్రఖ్యాత సైకాలజిస్ట్ డాక్టర్ భావ్నా బార్మి మాట్లాడుతూ, మనిషి జీవితంలో ఎమోషన్స్ అనేవి ఒక భాగం. మనకు ఇతరులతో ఉండే సంబంధాలు, రోజువారి జీవితంలో మనం చేసే ప్రతి పనిలో దాగి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా హాని జరుగుతుంది. దీని వల్ల మనం శరీరంలోని భావోద్వేగ నాడీవ్యవస్థ కు సంబంధం ఉన్న జీవనాడులన్నింటిలో మార్పులు వస్తాయి.
మన ఆలోచన విధానం, ఆనందం, బాధ, అనుకున్న పనులు సరిగ్గా చేయలేకపోవటం వంటి జరుగుతాయిని ఆమె తెలిపారు. మనలో ఏర్పడే భావాలకు అనుగుణంగా స్పందించటం చాలా ముఖ్యం. అందువల్ల మానసిక స్థితి మారడానికి చాలా సంబంధం కలిగి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మానసిక ఆరోగ్యానికి సంబందించిన కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం..
1. Anger :
కోపం ఎవరికైనా సరే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఎందుకంటే ఇది ఒక సహజంగా వచ్చే భావోద్వేగం. కానీ సందర్భాన్ని బట్టి దాన్ని నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. మనం మానసికంగా ఆరోగ్యంగా లేనప్పుడు దాని అనుభూతిని పొందుతాం అని డాక్టర్ బార్మి చెప్పింది. కోపంలో ఉన్నప్పుడు మనం చిరాకు పడడటం వంటి పనులు చేస్తుంటాం.
2. Feeling hopeless :
ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆ పని మనకు అనుకూలంగా జరిగే వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అలానే మానసిక ఆరోగ్యంలో కూడా మార్పు వచ్చే వరకు మీరు కృషి చేయలేరు అని మీరు నమ్ముతారు. కానీ, మీరు నిరాశ, నిస్సహయత, పనికి రాని ఆలోచనలతో ఉన్నప్పుడు ఈ స్థితిని అనుభవిస్తారు.
3. Losing interest in your favourite activities :
మీరు చేయానులకునే పనులను చేయలేకపోటం, వర్క్ ఔట్ లపై శ్రద్ద పెట్టకపోటం, టెలివిజన్ చూడకపోటం వంటి పనులను ఆసక్తిని కోల్పోతారు. అంతేకాకుండా మనసుకు సంతోషం కలిగించే పనుల్లో పాల్గొనలేకపోటవం వంటివి మానసిక భావోద్వేగానికి తెలియజేస్తుందని బార్మి తెలిపారు.
4. Becoming socially distant :
మీరు మానసికంగా ఆరోగ్యంగా లేకపోవటం వల్ల మీ కుటుంబ సభ్యులతోను, స్నేహితులకు, మీ బాగా కావాల్సిన వారి నుంచి మిమ్మల్ని మీరే దూరంగా ఉంచుకోవటానికి దారి తీస్తుంది. ఒకప్పుడు మీకు బాగా దగ్గర ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండటం వంటి జరుగుతాయి. అందుకే మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
5.Hampered productivity :
మీరు ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురై, మానసికంగా ఆరోగ్యంగా లేకపోగా, సాధారణ పనులపై ఆసక్తిని కనబరచలేకపోతారు. వాటికి ప్రాధాన్యత ఇవ్వలేక పోతుంటారని డాక్టర్ బార్మి అన్నారు.
ఆలోచన విధానంలో మార్పులు, ఎక్కువగా ఆందోళన పడటం వల్ల కొన్నిసార్లు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది. ఏకాగ్రతను కోల్పోతారు. ఇలాంటి వాటిని మీరు అనుభవిస్తుంటే కనుక మీ మానసిక ఆరోగ్య పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవటానికి ఎవరినైనా ఆరోగ్య నిపుణుని సలహాలు పాటించటం మంచిది.