వారంలో బ్రెయిన్ సర్జరీ : గుర్రపు స్వారీ చేస్తానంటూ బుడ్డోడి పంతం!

వారంలో ఐదేళ్ల బుడ్డోడికి బ్రెయిన్ సర్జరీ.. అతడికి యూనికార్న్ గుర్రాలపై స్వారీ చేయాలని కోరిక. అందుకోసం తల్లిదండ్రులను పదేపదే అడిగేవాడు. ఓ రోజున వ్యాట్ హాస్(5) తన తల్లిని యూనికార్న్ స్టోర్‌కు తీసుకెళ్లమని గోల చేశాడు. అక్కడే అతడికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు వ్యాట్ తల్లిదండ్రులు.
తెల్లని గుర్రంపై కూర్చొబెట్టి స్వారీ చేయించారు. అప్పుడు అతడి కళ్లలో సంతోషాన్ని చూసి పేరంట్స్ మురిసిపోయారు. చిన్నప్పటి నుంచి ఆరోగ్య పరంగా సమస్యలతో బాధపడుతున్నాడు. తోటి స్నేహితులతో కలసి ఆడుకోవాల్సిన వయస్సులోనే వ్యాట్ కు (medulloblastoma) బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు గతనెలలో వైద్యులు నిర్ధారించారు.
అప్పటినుంచి స్కూలుకు కూడా వెళ్లడం మానేశాడు. గతవారమే శస్త్రచికిత్స నిమిత్తం మెంఫీస్‌లోని సెయింట్ జ్యూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పటిల్‌లో చేరాడు. ఈ వారమే అతడికి సర్జరీ చేసి ట్యూమర్ ను వైద్యులు తొలగించనున్నారు. శస్త్రచికిత్సకు ముందుగానే వ్యాట్ తల్లి జెన్నీఫర్ నెల్సన్ అతడి స్నేహితులందరిలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది.
అప్పటికప్పుడే వ్యాట్ స్నేహితుల తల్లిదండ్రులకు కూడా పార్టీకి సంబంధించి రెండు కేకులు, ఫ్రూట్ జ్యూస్ తీసుకురావలంటూ మెసేజ్ పంపింది. నెల్సన్ కుటుంబానికి ఓ గడ్డి మైదానం ఉంది. అందులో బొనాంజా అనే ఒక తెల్లని గుర్రం ఉంది. ఆ గుర్రంపై రంగురంగుల పెన్సిళ్లతో చక్కగా ఇంద్రధనస్సు మాదిరిగా పెయింట్ వేశారు.
ఆ పార్టీకి హాజరైన వ్యాట్ తో సహా స్నేహితులందరికి గుర్రపు స్వారీ చేసే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత వ్యాట్ స్వారీ చేసిన ఫొటోను తమ ఫేస్ బుక్ పేజీ కవర్ ఫొటోగా పేరంట్స్ పెట్టుకున్నారు. హాస్పత్రిలో బెడ్ పై పడుకున్న వ్యాట్ పక్కన రెండు యూనికార్న్స్ బొమ్మలను ఉంచారు. అంతేకాదు.. వ్యాట్ బ్రెయిన్ సర్జరీకి అయ్యే వైద్య ఖర్చుల కోసం గోఫౌండ్ మీ అకౌంట్ సాయంతో 8వేల డాలర్లకు పైగా విరాళాలు కోరారు.
కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యాట్ సహా అతడి కుటుంబానికి మద్దతు పలికారు. వ్యాట్ ఫేస్ బుక్ పేజీని ఫాలో అయ్యే ఇతర నగరాల్లోని వాసులంతా కూడా అతడి కోసం గిఫ్ట్ లు, కార్డులను పంపారు. స్కూల్లోని స్నేహితుల్లో ఒకరు యూనికార్న్ డ్రాయింగ్స్ గీసి గిఫ్ట్ గా పంపారు.