AI Romance: ఓరి నాయనో.. ఏఐతో రొమాన్సా..! హ్యూమన్ రిలేషన్స్‌లో కొత్త కోణం.. ఎందుకిలా..
మహిళల్లో కూడా ఈ ట్రెండ్ ఎక్కువని చెప్పారు. స్మార్ట్ ఫోన్లని వాడే టెకీలలో ప్రతి 10మంది మహిళల్లో ముగ్గురు ఇలాంటి పని చేస్తున్నట్లు అప్పట్లో బయటపడింది.
AI Romance: ఏఐ సిచ్యుయేషన్‌షిప్..హ్యూమన్ రిలేషన్స్‌లో ఇదో కొత్త కోణం..గట్టిగా మాట్లాడితే ఇదసలు హ్యూమన్ కాదు..హ్యూమనాయిడ్ రిలేషన్..కొత్త తరం యువతలో వెర్రితలలు వేస్తోన్న చాట్‌బోట్ వాడకంతో మొదలైన ట్రెండ్ ఇది..ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తయారు చేసిన చాట్‌బోట్‌లతోనే వీరు రొమాన్స్ చేస్తున్నారట అదొక్కటే కాదు, వీళ్ల భాగస్వాముల్లో ఎవరికైనా ఈ విషయం తెలిసినా పర్లేదంటున్నారట..
తమ పార్ట్‌నర్‌కి ఏఐతో వర్చువల్ రొమాన్స్ అలవాటు ఉన్నా ఓకేనంటున్నారట కొత్త తరం యువత! హ్యాపెన్ అనే డేటింగ్ యాప్ చేసిన ఓ ఆన్‌లైన్ సర్వేలో ఈ విషయం తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో వచ్చిన యాప్స్.. చాట్ బోట్స్‌తో ఈ మధ్యకాలంలో శృంగారంలో మునిగితేలుతున్న సంగతి మూడు నెలల క్రితం ఓ సర్వే బలటపెట్టగా.. తాజా సర్వే అంతకిమించిన విపరీతాన్ని బయట పెట్టింది.
ఆగస్ట్ నెలలో బయటపడిన సర్వేలో చాలా మంది యువత AIతో శృంగార సంభాషణలు చేస్తున్నారని తేలింది.. టెక్నాలజీలో కొత్తదనాన్ని, సర్‌ప్రైజ్‌ను అన్వేషించడానికి ఇలా చేస్తున్నట్లు సదరు సర్వే చెప్పగా..అసలు మహిళల్లో కూడా ఈ ట్రెండ్ ఎక్కువని చెప్పారు. స్మార్ట్ ఫోన్లని వాడే టెకీలలో ప్రతి 10మంది మహిళల్లో ముగ్గురు ఇలాంటి పని చేస్తున్నట్లు అప్పట్లో బైటపడింది. ఇది ఎంతమందిని శాంపిల్‌గా తీసుకుని చేశారనేది చెప్పలేదు..కానీ..మనుషులను వదిలేసి ఇలా ఏఐ చాట్‌బాట్‌లతో రొమాన్స్ ఏంటనే చిలిపి ప్రశ్నలు అప్పట్లో వినిపించాయ్.
ఇక ఇప్పుడు హపెన్ సర్వే ప్రకారం ఇలా ఏఐ రొమాన్స్‌కి అలవాటుపడిన వారిలో వారి భాగస్వాముల్లో 54శాతం మంది ఈ విషయం తెలిసినా కూడా లైట్ తీసుకుంటున్నారట. ఇదేం రియల్ బాండింగ్ కాదు కదా.. సిచ్యుయేషన్ షిప్ మాత్రమే అనేది వారి పాయింట్. ఈ సర్వే మన దేశంలోని 2వేల మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ఫలితాన్ని వెల్లడించింది. మరి ఈ జెన్ జి బ్యాచ్ అంతా ఏఐ రొమాన్స్ ఎందుకు కోరుకుంటున్నారంటే..
ఎవరికీ జవాబుదారీ కాకపోవడం..మనుషుల్లా కాకుండా..కేవలం అవతలి వారి అవసరాలకు తగినట్లుగా స్పందిస్తుడం కారణాలుగా చెప్తున్నారు.
Also Read: పాసింజర్లకు నరకం చూపించిన ఇండిగోకి డబుల్ షాక్..!
