Woman Gives Birth To Son Baby : కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన 56 ఏళ్ల మహిళ..!!
కొడుకు బిడ్డకు జన్మనిచ్చిందో ఓ తల్లి. కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా ఆమె ఓ గుర్తింపు పొందితే..నా బిడ్డకు నా తల్లే జన్మ ఇవ్వటం చాలా చాలా గొప్ప సందర్భం అని ఈ కొడుకు మురిసిపోతున్నాడు.

56 Year Old Woman Gives Birth To Son Baby
56 Year Old Woman Gives Birth To Son Baby : సరోగసి..ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించే పదం. ఎంతోమంది సెలబ్రిటీలు సరోగసి ద్వారా తల్లితండ్రులు అవుతున్నారు. సరోగసి అనేది తల్లికాలేని వారి కోసం అందుబాటులోకి వచ్చిందే అయినా…తల్లి అయ్యే అవకాశం ఉన్నవారు కూడా వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఈ సరోగసి ద్వారా 56 ఏళ్ల మహిళ తన మనుమరాలికి జన్మనిచ్చింది. కోడలి ఐదో బిడ్డకు నాయనమ్మ తల్లి అయ్యింది. నానమ్మా అని పిలిపించుకోవాల్సిన ఆమె కాస్తా ఆ బిడ్డకు తల్లి అయ్యింది. అలా ఆమె మనుమరాలికే అమ్మ అయ్యింది. ఈ అరుదైన ఘటన అమెరికాలో జరిగింది.
అమెరికాలోని ఉతహ్ ప్రాంతంలో నివాసం ఉండే జెఫ్ హౌక్, కేంబ్రియా దంపతులు. వీరికి నలుగురు పిల్లలున్నారు. కానీ మరో బిడ్డను కావాలనుకున్నారు. కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల కేంబ్రియా గర్భం తీసేయాల్సి వచ్చింది. కానీ తమకు మరో బిడ్డ కావాలని తపనపడ్డారు. సరోగసి తప్ప అన్ని మార్గాల్లోను యత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు.
ఈ సమయంలో కొడుకు..కోడలి బాధను అర్థం చేసుకున్న జెఫ్ హౌక్ 56 ఏళ్ల తల్లి నాన్సీ హౌక్ ‘మీ కోసం నేను బిడ్డను కంటానని సరోగసి ద్వారా మీకు మరో బిడ్డను ఇస్తానని తెలిపింది. దీనికి నాన్సీ భర్త కూడా ఒప్పుకున్నాడు. కానీ దీనికి కొడుకు, కోడలు ఒప్పుకోలేదు. కానీ నాన్నీ కొడుకు, కోడలిని ఒప్పించింది. అలా సరోగసి ద్వారా కొడుకు ఐదో బిడ్డకు నాన్సీ జన్మనిచ్చింది. మరి ఆమెకు పుట్టిన బిడ్డ కూతురు అవుతుందా? మనుమరాలు అవుతుందా? హా ఇదంతా అమెరికాలో పెద్ద విషయం కాదుకదా..ఏది ఏమైనా ఈ సరోగసీ అనేది వావి వరుసల్ని కూడా మార్చిపారేస్తోంది కదా అనిపిస్తుంది ఇటువంటి అరుదైన ఘటనలు జరుగుతుండటం చూస్తుంటే..!!
ఆ పాపకు హన్హ అని పేరు పెట్టారు. కూడా చేశారు. ఈ విషయాన్ని కేంబ్రియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. నాన్సీ బేబీబంప్ ఫొటోలు సైతం పంచుకుంది. ప్రస్తుతం ఈ వార్త, ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.