Jakarta, Indonesia: : ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అయితే..సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర Sulawesi Manado ప్రాంతానికి 258 కిలోమీటర్లు భూకంప కేంద్రంగా గుర్తించారు.

Jakarta, Indonesia: : ఇండోనేషియాలో భూకంపం

Eathquake

Updated On : July 10, 2021 / 3:08 PM IST

Earthquake Indonesia  : ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అయితే..సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర Sulawesi Manado ప్రాంతానికి 258 కిలోమీటర్లు భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంప ధాటికి ప్రాణ, ఆస్తినష్టం సంభవించదనేది తెలియరాలేదు.

Read More : Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి.. ఒకే నెలలో ఏడోసారి..!

తరచూ ఇక్కడ భూమి కంపిస్తున్నదనే సంగతి తెలిసిందే. ప్రకృతి వైపరీత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఇక్క భూకంపాలు సంభవించడం పరిపాటైంది. ఎందుకంటే..ఈ దేశం భౌగోళికంగా ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనే గీత మీద ఉందని, ఈ గీత మీద తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తుంటారు.

Read More : CPI Narayana : అంతవరకు సీఎం జగన్ బెయిల్ రద్దు కాదు, నారాయణ సంచలన వ్యాఖ్యలు
జనవరిలో Sulawesi ప్రాంతంలో సంభవించిన భూకంప ధాటికి 100 మందిదాక మరణించిన సంగతి తెలిసిందే. వేలాది మంది నిరాశ్రులయ్యారు. తరచూ భూకంపాలు సంభవిస్తున్న నేపథ్యంలో…నిర్మాణాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2018లో లోంబాక్ ద్వీపంలో ఓ శక్తివంతమైన భూకంపం సంభవించింది. రెండు వారాల్లో అనేక ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. హాలీడే ద్వీపం దీనికి సమీపంలో ఉన్న సుంబావాలో సంభవించిన భూకంప తీవ్రతకు 550 మంది దాక చనిపోయారు. సులావేసి ద్వీపంలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం..తర్వాత వచ్చిన సునామీ కారణంగా ఏకంగా 4 వేల 300 మందికిపైగా మృతి చెందారని సమాచారం.

Read More : Corona Delta Variant : ‘డెల్టా’ మహా ప్రమాదకారి.. ఒకరి నుంచి 8మందికి వ్యాప్తి.. కేసులు పెరగడానికి కారణమిదే..