కూలిన మిలటరీ చాపర్ : ఆరుగురు మృతి 

  • Published By: veegamteam ,Published On : October 28, 2019 / 07:19 AM IST
కూలిన మిలటరీ చాపర్ : ఆరుగురు మృతి 

Updated On : October 28, 2019 / 7:19 AM IST

కొలంబియా దేశంలో మిలటరీ హెలికాప్టర్ కూలిపోయింది. అల్బాన్ మున్సిపాలిటీలో మిలటరీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బెల్ 412 హెలికాప్టర్ పాలన్ క్యూరో వైమానిక స్థావరం నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. అనంతరం ఈ హెలీకాప్టర్ కుప్పలికూలనట్లుగా సమాచారం అందింది.

హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురు కొలంబియా వైమానిక దళానికి చెందిన పైలెట్లు మరణించారని..కొలంబియా వైమానిక దళాధికారులు తెలిపారు. గతంలో ఈ హెలికాప్టర్ లో కొలంబియా అధ్యక్షుడు పలు సార్లు ప్రయాణించారని, ఇది బాగా ఉండేదని కొలంబియా వైమానిక దళ అధికారులు చెప్పారు.

హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని వైమానిక దళ అధికారులు చెప్పారు. హెలికాప్టరు కూలిన ఘటన దురదృష్టకరమని..ఆరుగురు సిబ్బంది మరణించటం విచారకరమని వైమానిక దళాధికారులు చెప్పారు.