Earthquake: వామ్మో.. మరో దేశంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల రేడియస్‌లోని తీరప్రాంతాలకు భీకర అలలు దూసుకువచ్చే ప్రమాదం ఉందని చెప్పింది.

ఓషియానియాలోని టోంగా దేశంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. టోంగా మెయిన్ ఐస్‌ల్యాండ్‌కి ఈశాన్యంగా, దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం కూడా హెచ్చరికను జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల రేడియస్‌లోని తీరప్రాంతాలకు భీకర అలలు దూసుకువచ్చే ప్రమాదం ఉందని చెప్పింది.
భూకంపం వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణనష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు. టోంగా. ఆ దేశంలో 1,00,000కు పైగా జనాభా ఉంది. వీరిలో ఎక్కువ మంది టోంగటాపు అనే ప్రధాన ద్వీపంలో నివసిస్తున్నారు.
మియన్మార్, థాయిలాండ్‌లో ఇప్పటికే భారీ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని మరవక ముందే ఇప్పుడు టాంగోలోనూ భారీ భూకంపం సంభవించడం గమనార్హం.
Also Read: దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మృతి వెనుక “ఆ ఇండియన్ డ్రగ్”?: పోలీసు అధికారి సంచలనం