Guinness World Record : ట్రిపుల్ హార్ట్ బైపాస్ సర్జరీ పేషెంట్.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు.. వరల్డ్ రికార్డు సాధించాడు
గుండెకు బైపాస్ సర్జరీ ఒకసారి జరిగిన కేసుల గురించి విన్నాం. కానీ ఒక వ్యక్తికి ఒకే సంవత్సరంలో మూడుసార్లు బైపాస్ సర్జరీ జరిగింది. ఇలా జరిగి 45 సంవత్సరాలు దాటినా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు ఈ పేరుతో ఉన్న పాత ప్రపంచ రికార్డును తిరగ రాశాడు.

Guinness World Record
Guinness World Record : గుండెలో దెబ్బ తిన్న ధమనుల్ని సరిచేయడానికి హార్ట్ బైపాస్ సర్జరీ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సర్జరీకి వెళ్తారు. ఒకసారి బైపాస్ చేయించుకున్న వారి గురించి విన్నాం. కానీ ఓ వ్యక్తి మూడుసార్లు హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకోవడమేకాదు అతను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కాడు.
Weight Loss: సర్జరీ అవసరమే లేదు.. ఇవి తింటూ సులువుగా బరువు తగ్గించుకోండి!
77 సంవత్సరాల బ్రిటీష్ వ్యక్తి కోలిన్ హాన్ కాక్ ట్రిపుల్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకుని ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఈ విషయాన్ని గిన్నిస్ యాజమాన్యం ప్రకటించింది. ఛాతినొప్పి రావడంతో కోలిన్‌కి 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదటిసారి సర్జరీ జరిగిందట. ఆ తరువాత ఒక సంవత్సరంలోనే అతనికి మూడుసార్లు బైపాస్ సర్జరీ చేశారట. ఇన్ని సార్లు చేసిన శస్త్ర చికిత్స విజయవంతం అయినప్పటికీ అతను ఎంతకాలం జీవిస్తాడో చెప్పలేం అని వైద్యులు చెప్పారట. అయితే కోలిన్‌కి ఇప్పుడు 77 సంవత్సరాలు. ఇప్పటికీ బలంగా, ఆరోగ్యంగా ఉండి అందరి అంచనాలను అధిగమించాడు.
కోలిన్‌కు వంశపారం పర్యంగా వచ్చే హైపర్ కొలెస్టెరోలేమియా ఉందట. ఇది అధిక కొలెస్ట్రాల్, కరోనరీ హార్ట్ డిసీజ్‌కు కారణమయ్యిందట. 30 ఏళ్ల వయసులో కోలిన్ ఎంతో చురుకుగా ఉండేవాడట. గేమ్స్ ఆడటంతో పాటు ఫిజికల్ ఫిట్ నెస్‌కి సంబంధించి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకునేవాడట. ఆ సమయంలో గుండెకు సంబంధించి తనకు సమస్యలు ఉన్నట్లు బయటపడలేదట. అయితే చిన్నతనంలో అతను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేదట.
Plastic Surgery : ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ వాడతారా? అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు..
కోలిన్‌కి మూడుసార్లు హార్ట్ బైపాస్ సర్జరీ జరిగిన తరువాత 45 సంవత్సరాల 361 రోజులు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఈ విషయాన్ని గిన్నిస్ యాజమాన్యం ఆగస్టు 4, 2023 న అధికారికంగా వెల్లడించింది. గతంలో USA కి చెందిన డెల్బర్ట్ డేల్ మెక్‌బీ కూడా ఆపరేషన్ తర్వాత 90 సంవత్సరాలు జీవించాడు. అతనికి సర్జరీ జరిగిన తరువాత 41 సంవత్సరాల 63 రోజులు ఆరోగ్యంగా ఉన్నాడు. 2015 లో అతను మరణించాడు.