Dwarf Dead Star : ఇదే డెడ్ స్టార్.. చంద్రుడంత సైజు.. సూర్యుడంత బరువు!

అంతరిక్షంలో అంతులేని ఖగోళ అద్భుతాలెన్నో.. ఎన్నెన్నో.. ఇప్పటికీ రహాస్యమే.. అందుకే అంతరిక్ష రహాస్యాలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంతరిక్షంలో ఓ అతిచిన్న తెల్లని మరుగుజ్జు నక్షత్రాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

Dead Star large as Moon, Weighs more than Sun : అంతరిక్షంలో అంతులేని ఖగోళ అద్భుతాలెన్నో.. ఎన్నెన్నో.. ఇప్పటికీ రహాస్యమే.. అందుకే ఖగోళ సైంటిస్టులు అంతరిక్ష రహాస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు లోతుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంతరిక్షంలో ఓ అతిచిన్న తెల్లని మరుగుజ్జు నక్షత్రాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. సాధారణ నక్షత్రాల మాదిరిగానే.. కానీ, వాస్తవానికి మన చంద్రుని కంటే చాలా చిన్నదిగా ఉంటుందట.. భగభగమని మండే సూర్యుని కంటే చాలా బరువుగా ఉంటుందట.. అదే.. డెడ్ స్టార్.. తెల్లని మరుగుజ్జు (White dwarves) నక్షత్రాలనే డెడ్ స్టార్స్ (Dead Stars) అని పిలుస్తారు.

రెడ్ ప్లానెట్ బయటి వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ డెడ్ స్టార్స్ ప్రధానంగా కార్బన్, ఆక్సిజన్‌తో నిండి ఉంటాయి. ప్రత్యేకించి ఈ రకం డెడ్ స్టార్లను (ZTF J1901+1458)గా పిలుస్తారు. మరగుజ్జు నక్షత్రాల్లో ఈ డెడ్ స్టార్ దాదాపు 1,700 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. అంటే.. చంద్రుడి 1,737 వ్యాసార్థానికి దగ్గరగా ఉంటుంది. మన భూగ్రహం నుంచి 130 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. అయినా దాని పరిమాణం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.3 రెట్లు ఉంటుంది.

చిన్నదే కానీ.. శక్తివంతమైనది :
ఈ తెల్ల మరగుజ్జు నక్షత్రంలో అద్భుతమైన లక్షణం ఉందంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.. చాలా వేగంగా తిరుగుతోందని అంటున్నారు. తెల్ల మరగుజ్జు నక్షత్రాలు.. సాధారణంగా భూమికి సమానంగా.. 6,300 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటాయి. ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. తెల్లని మరుగుజ్జు నక్షత్రాలు.. ఇతర నక్షత్రాలను రాలిపోకుండా భౌతికంగా శక్తిని ఉత్పత్తి చేయలేవు. ఎందుకంటే ఈ డెడ్ స్టార్లకు మండే స్వభావం లేదు. అణువులోని ఎలక్ట్రాన్లు భౌతికంగా ఒకదానికొకటి రాసుకోవడం ద్వారా ఆకారం ఏర్పడుతుంది. మిగతా గ్రహాల మాదిరిగానే ఈ డెడ్ స్టార్ కూడా తిరుగుతుంది. ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి పూర్తిగా తిరుగుతుంది.

సాధారణంగా భూమి ప్రతిరోజూ ఒకసారి పూర్తి భ్రమణాన్ని చేస్తుంది. అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మన గ్రహం కంటే కనీసం ఒక బిలియన్ రెట్లు బలంగా ఉంటుందని అంచనా. కాలిఫోర్నియాలోని పాలోమర్ అబ్జర్వేటరీ (Palomar Observatory)లోని జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ (Zwicky Transient Facility)ని ఉపయోగించి నక్షత్ర అవశేషాలను కనుగొన్నారు. తెల్లని మరుగుజ్జు నక్షత్రాలుగా పిలిచే ఈ డెడ్ స్టార్లు ప్రకాశవంతంగా కనిపిస్తుంటాయి. కాలక్రమేణా నెమ్మదిగా చల్లగా మారి మసక బారిపోతుంటాయి. చివరికి ఆరిపోయి నల్లటి మరగుజ్జు (dwarves) నక్షత్రాలుగా మారుతుంటాయి.

ట్రెండింగ్ వార్తలు