Hindu Boy Jailed In Pakistan : దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పాకిస్తాన్ లో హిందూ బాలుడికి జైలు శిక్ష

సోషల్ మీడియాలో దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్ లో ఓ హిందూ బాలుడికి జైలు శిక్ష విధించారు. ఈ ఘటన సింధ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అమ్మాయిల మత మార్పిడిపై దేవుడు క్రూరమైన వాడని విమర్శిస్తూ సదరు బాలుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Hindu Boy Jailed In Pakistan : దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పాకిస్తాన్ లో హిందూ బాలుడికి జైలు శిక్ష

JAIL

Updated On : January 14, 2023 / 3:57 PM IST

Hindu Boy Jailed In Pakistan : సోషల్ మీడియాలో దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్ లో ఓ హిందూ బాలుడికి జైలు శిక్ష విధించారు. ఈ ఘటన సింధ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అమ్మాయిల మత మార్పిడిపై దేవుడు క్రూరమైన వాడని విమర్శిస్తూ సదరు బాలుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తమ బాలుడు కనిపించడం లేదంటూ నవంబర్ లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల రోజుల తర్వాత బాలుడిని జైలులో ఉంచినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

బిట్టర్ వింటర్ నివేదిక ప్రకారం.. లవ్ కుమార్ అనే బాలుడు మత మార్పిడిపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. అందులో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఓ దేవుడా! నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నావ్..? అంటూ దేవుడిని ప్రశ్నిస్తూ ఉర్దూలో రాశాడు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Muslim singer Farmani Naaz : శివుడిపై భక్తిగీతాన్ని పాడిన గాయనిపై ముస్లిం సంఘాల ఆగ్రహం

బాలుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించింది. అయితే తమ కుమారుడు కనిపించడం లేదదంటూ అతని తల్లిదండ్రులు నవంబర్ 22 నుంచి వెతుకుతున్నారు. చివరికి డిసెంబర్ 27న బాలుడిని జైలులో పెట్టినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే, పాకిస్తాన్ లో దైవదూషణపై చట్ట స్పష్టంగా లేదని, కొన్ని సందర్భాల్లో మరణిశిక్ష కూడా విధించవచ్చని కొందరు న్యాయ పరిశీలకులు అంటున్నారు.

2022లో పంజాబ్, సింధ్, ఖైబర్ ఫఖ్తున్థ్వాలోని పాకిస్తాన్ మైనారిటీ కమ్యూనిటీపై దైవదూషణ ఆరోపణలు చేయడం ద్వారా అనేక దాడులు జరిగాయి. దైవదూషణను సాకుగా వాడుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మైనారిటీ వర్గాలకు చెందిన భూములను గుంజకుని వారి నుంచి డబ్బులు దండుకునేందుకు ప్రజలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటారని కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.