Muslim singer Farmani Naaz : శివుడిపై భక్తిగీతాన్ని పాడిన గాయనిపై ముస్లిం సంఘాల ఆగ్రహం

ఫర్మానీ నాజ్ అనే ముస్లిం యువతి శివుడిపై భక్తి గీతం పాడిందని ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. ఇది షరియాకు విరుద్ధమని అల్లాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

Muslim singer Farmani Naaz : శివుడిపై భక్తిగీతాన్ని పాడిన గాయనిపై ముస్లిం సంఘాల ఆగ్రహం

muslim singer recites Har Har Sambhu devotional song : కళకు మతం అడ్డు వస్తుందా? అంటే అవుననే ఘటనలో జరుగుతున్నాయి. గానం..నృత్యం వంటి కళలకు కూడా మతాలను అంటకట్టే విష సంస్కృతి పెరుగుతోంది. అదే జరిగింది యూపీలోని ముజఫర్ నగర్ లో. ఓ ముస్లిం మహిళ హిందూ దేవుడైన శివుడిపై ఓ భక్తిగీతం పాడింది. దీంతో ఆమెపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆమె ముస్లింల మనోభావాలను దెబ్బతీసింది అంటూ మండిపడుతున్నారు. అల్లాను క్షమాపణ కోరాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందని ఫర్మానీ నాజ్ గాయని. ఆమె యూట్యూబర్ కూడా. తాను పాడే పాటల్ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె ఖాతాకు 30లక్షల మంది సబస్ స్క్రబర్లు ఉన్నారు. ఫర్మానీకి ఓ బాబు పుట్టాక భర్త నిరాదరించాడు. కానీ కొడుకు పెంచటానికి చాలా కష్టపడింది. ఆ కష్టానికి తన గానాన్ని తోడు చేయాలనుకుంది. అలా కొడుకుని పెంచుకుంటూ యూట్యూబ్ ను ఆదాయ వనరుగా మార్చుకుంది. పాటలు పాడి వాటిని యూట్యూబ్ లో పోస్టు చేస్తుంది. ఫర్మానీ నాజ్ ఏదో మామూలు యూట్యూబర్ కాదు. ఆమె గానికి అభిమానులున్నారు. ఆమె యూట్యూబ్ ఖాతాకు 30 లక్షల మందికి పైగా సబ్ స్క్రయిబర్లు ఉన్నారు.

ఈక్రమంలో ఫర్మానీ ‘హర్ హర్ శంభు’ అంటూ శివుడిపై భక్తిగీతం పాడి యూట్యాబ్ లో అప్ లోడ్ చేసింది. దీంతో ఫర్మానీ నాజ్ పలు ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. మహిళలు పాటలు పాడటం..డ్యాన్స్ చేయటం షరియాకు విరుద్ధం అని..పైగా హిందూ దేవుడిపై పాట పాడి ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందంటూ..కమని దేవబంద్ ఉలేమా మౌలానా అసద్ ఖాస్మీ మండిపడ్డారు. ఇది దైవ విరుద్ధమని..తక్షణమే ఆమె అల్లాకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగం ప్రకారం ఇతర మతాల సెంటిమెంట్లను దెబ్బతీయకుండా, తన మతాన్ని తాను అనుసరించుకోవచ్చని, దాని ప్రకారం నాజ్ విషయంలో ఎలాంటి సమస్యలేదని ముఫ్తీ జుల్ఫికర్ అనే ముస్లిం ప్రముఖుడు అభిప్రాయపడ్డారు. తన పట్ల విమర్శలు వస్తున్న క్రమంలో స్పందించిన ఫర్మానీ నాజ్ ‘‘ కళాకారులకు మతాన్ని ఆపాదించవద్దని..శివుడిపై పాట పాడినంత మాత్రన ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లుకాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని తనను తప్పుబట్టడం ఇక ఆపాలని హితవు పలికారు. తాను ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఖవ్వాలీ కూడా పాడతానని అన్నారు. పాడేటప్పుడు తాను ఇటువంటి పట్టించుకోనని స్పష్టం చేశారామె.