Scorpion Venom: అక్కడ తేలు విషానికి యమ డిమాండ్.. లీటర్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

తేలు..అత్యంత విషకరమైన జీవి. దీని కాటు వలన మనుషులు ప్రాణాలు కొల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే తేలు జాతి ప్రాణాలు తీయడమే కాదు, కొన్ని రకాల వ్యాధులు నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.

Scorpion Venom: అక్కడ తేలు విషానికి యమ డిమాండ్.. లీటర్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Scorpion Venom

Updated On : August 18, 2022 / 2:03 PM IST

Scorpion Venom: తేలు..అత్యంత విషకరమైన జీవి. దీని కాటు వలన మనుషులు ప్రాణాలు కొల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే తేలు జాతి ప్రాణాలు తీయడమే కాదు, కొన్ని రకాల వ్యాధులు నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. కాస్త షాకింగ్‌గా ఉండొచ్చు కానీ ఇది ఫాక్ట్. మనుషులకు వచ్చే అనేక రకాల కీళ్ల సంబంధిత వ్యాధులకు తేలు విషం సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా పలు దేశాల్లో ఈ తేలు విషాన్ని అనేక రకాల ఔషదాలకు వినియోగిస్తారు.

YouTube Channels Blocked: మరో 8 యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. 100 దాటిన సంఖ్య..

టర్కీలోని ఓ ల్యాబ్ తేళ్ల నుంచి రోజుకు 2 గ్రాముల విషాన్నిసేకరిస్తుంది. బాక్సుల్లోంచి తేళ్లను బయటకు తీసి వాటి నుంచి ప్రత్యేక పద్దతుల్లో విషం సేకరిస్తారు. ఆ తర్వాత విషాన్ని గడ్డ కట్టించి అనంతరం పొడి చేసి విక్రయిస్తారు. ఈ తేలు విషం ధర లీటర్ రూ. 80కోట్లు వరకు పలుకుతుంది. గ్రాములు వచ్చి రూ. 80వేల వరకు విక్రయిస్తారు. అయితే ఒక్క తేలు దాదాపు 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ల్యాబ్ లో ప్రతిరోజూ 2 గ్రాముల విషాన్ని పొందగలదని తేళ్ల పెంపకం ఫామ్ యజమాని మెటిన్ ఓరెన్లర్ చెప్పారు.

Munugodu By Election : మునుగోడు కాంగ్రెస్ లో ‘టికెట్ లొల్లి’..అభ్యర్థి ఎంపిక క్లారిటీ వచ్చిందా? ఆశావహుల నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి?

2020లో ప్రారంభమైన ఓరెన్లర్స్ ఫామ్‌లో ఇప్పుడు ఆండ్రోక్టోనస్ టర్కియెన్సిస్ జాతికి చెందిన దాదాపు 20,000 తేళ్లు ఉన్నాయి. ఇవి 2021లో స్కార్పియాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన కథనంలో ఒక ప్రత్యేకమైన రకంగా గుర్తించబడ్డాయి. మేమిద్దరం తేళ్లను స్వయంగా పెంచుకుంటామని, వాటికి పాలు కూడా పెడతామని ఓరెన్లర్ చెప్పారు. తేళ్ల నుంచి తీసిన విషాన్ని పొడిగా తయారు చేసి ఐరోపాకు విక్రయిస్తామని అన్నారు. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్‌లకు ఎగుమతి చేయబడిన ఈ విషాన్ని సౌందర్య సాధనాలు, నొప్పి నివారణలు, యాంటీబయాటిక్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఒక లీటరు విషం విలువ 10 మిలియన్ డాలర్లు( సుమారు 80కోట్లు) ఉంటుంది అని ఓరెన్లర్ చెప్పారు.