Viral Video: టెన్నిస్ మ్యాచ్ జరుగుతుండగా కోర్టులోకి దూసుకొచ్చిన వ్యక్తి.. నిప్పంటించుకొని నిరసన.. ఎందుకంటే?

లండన్‌లో జరిగిన టెన్నిస్ లావర్ కప్ మ్యాచ్ సందర్భంగా శుక్రవారం ఒక వ్యక్తి కోర్టులో పరిగెత్తి తన చేతికి నిప్పంటించుకోవడంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: టెన్నిస్ మ్యాచ్ జరుగుతుండగా కోర్టులోకి దూసుకొచ్చిన వ్యక్తి.. నిప్పంటించుకొని నిరసన.. ఎందుకంటే?

man sets his arm on fire

Updated On : September 24, 2022 / 9:08 AM IST

Viral Video: లండన్‌లో జరిగిన టెన్నిస్ లావర్ కప్ మ్యాచ్ సందర్భంగా శుక్రవారం ఒక వ్యక్తి కోర్టులో పరిగెత్తి తన చేతికి నిప్పంటించుకోవడంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. బ్రిటన్‌లో ప్రైవేట్ జెట్ విమానాల వినియోగానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తి నిరసన వ్యక్తం చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో వ్యక్తి.. టెన్నిస్ నెట్‌కు సమీపంలో కోర్టులోకి దూసుకెళ్లి కూర్చోవటం చూడొచ్చు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతని చేతికి అంటుకున్న మంటలను ఆర్పేసి సదరు వ్యక్తికి కోర్టు బయటకు తీసుకెళ్లారు.

India vs Australia Match: రేపు భాగ్యనగరంలో భారత్ – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. ఫైనల్ పోరుకు ముస్తాబైన ఉప్పల్ స్టేడియం..

లండన్‌లోని O2 అరీనాలో స్టెఫానోస్ సిట్సిపాస్, డియెగో స్క్వార్ట్జ్‌మాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సమయంలో స్టేడియంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆటను కొంతసేపు ఆపివేశారు. అనంతరం పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఆ వ్యక్తి ‘ఎండ్ UK ప్రైవేట్ జెట్స్’ అనే నినాదంతో కూడిన టీ-షర్టును ధరించాడు. బ్రిటీష్ మీడియా ప్రకారం.. అతను ఎండ్ UK ప్రైవేట్ జెట్స్ గ్రూప్‌లో సభ్యుడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఓ నెటిజన్.. “అతను వెంటనే పశ్చాత్తాపపడినట్లు కనిపిస్తోంది,” అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆ వ్యక్తి తన చేతికి మంటలు అంటుకున్న తర్వాత భయాందోళనలకు గురవుతాన్నాడని తెలిపాడు.