India vs Australia Match: రేపు భాగ్యనగరంలో భారత్ – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. ఫైనల్ పోరుకు ముస్తాబైన ఉప్పల్ స్టేడియం..

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

India vs Australia Match: రేపు భాగ్యనగరంలో భారత్ – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. ఫైనల్ పోరుకు ముస్తాబైన ఉప్పల్ స్టేడియం..

Uppal Stediam

India vs Australia Match: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో ఇరుజట్లు చెరొకటి గెలుచుకున్నాయి. రేపు ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ పోరులో జరగనుంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. మ్యాచ్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే నేడు సాయంత్రం భారత్, ఆస్ట్రేలియా ఇరు జట్ల ఆటగాళ్ళు హైదరాబాద్ చేరుకుంటారు. మూడు సంవత్సరాల తరువాత హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కావటంతో వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా‌పై భారత్ విజయం‌ సాధించడంతో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. దీంతో అభిమానులు మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

IndVsAus 2nd T20I : రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం

ఇదిలాఉంటే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజార్ బాధ్యతలు చేపట్టిన తరువాత నగరంలో జరుగుతున్న రెండవ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే. ఉప్పల్ స్టేడియం‌లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దాదాపు 190+ స్కోర్ చేసేలా పిచ్ రెడీ అవుతుంది. మ్యాచ్ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బంది‌తో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంకు సుమారు 40 వేల మంది క్రికెట్ అభిమానులు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. రాచకొండ పోలీసులు ఇప్పటికే ఉప్పల్ స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంటిలిజెన్సీ సెక్యూరిటీ తో ఆటగాళ్లకు భద్రత కల్పించనున్నారు. అదనంగా స్టేడియం చుట్టు 300 సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీస్ మానిటరింగ్ చేయనున్నారు.

Pakistan PM Sharif: భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం.. యుఎన్‌జీఎలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ ప్రధాని

మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్వే సర్వీస్‌లు ఆదివారం రాత్రి 1గంట వరకు అందుబాటులో ఉంటాయి. గ్రౌండ్ లో కూర్చున్న ప్రతి వ్యక్తి కదలికలను సీసీ టీవీ కెమెరాల ద్వారా పోలీస్‌శాఖ పర్యవేక్షణ చేయనుంది. ఆదివారం ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మ్యాచ్ కోసం వచ్చే వాహనదారులకోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 4 గంటల నుండి క్రికెట్ అభిమానులను స్టేడియం లోపలికి అనుమతించనున్నారు. మొత్తం 21 పార్కింగ్ స్థలాల ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 1 ద్వారా విపీఐ, వీవీఐపీలకోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. మ్యాచ్ సజావుగా నిర్వహించేలా హెచ్‌సీ‌ఏ ఫోకస్ పెట్టింది.