Doug Potato : వామ్మో.. ఈ ఆలుగడ్డ చూశారా.. ప్రపంచంలోనే అతిపెద్దదట!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆలుగడ్డను చూశారా? ఎంతపెద్దదిగా ఉందో చూడటానికి ఈ వింతైన ఆలుగడ్డ.. దీనికి పేరు కూడా ఉందడోయ్.. ‘డౌగ్’ ఆలుగడ్డగా పిలుస్తున్నారు.

Doug Potato : వామ్మో.. ఈ ఆలుగడ్డ చూశారా.. ప్రపంచంలోనే అతిపెద్దదట!

A Potato Named Doug May Be The Largest Ever Unearthed (1)

Updated On : November 6, 2021 / 7:53 AM IST

Doug Potato : ప్రపంచంలోనే అతిపెద్ద ఆలుగడ్డను చూశారా? ఎంతపెద్దదిగా ఉందో చూడటానికి ఈ వింతైన ఆలుగడ్డ.. దీనికి పేరు కూడా ఉందడోయ్.. ‘డౌగ్’ ఆలుగడ్డగా పిలుస్తున్నారు. ఇప్పటివరకూ కనుగొన్న ఆలుగడ్డల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. అసలు ఎక్కడ ఈ ఆలుగడ్డ దొరికిందంటే.. న్యూజిలాండ్‌కు చెందిన కోలిన్‌, డొన్నా బ్రౌన్‌ దంపతులు తమ పెరట్లో తవ్వకాలు మొదలుపెట్టారు. అప్పుడు వారికి ఈ భారీ ఆలుగడ్డ పెరగడాన్ని గుర్తించారు. 7.9 కిలోల బరువున్న ఈ ఆలుగడ్డ ఇంట్లోని పెరట్లో పెరగడం చూసి దంపతులు ఆశ్చర్యపోయారు. వెలికితీసిన తర్వాత ఆలుగడ్డ సైజును చూస్తే.. తమ ఇంట్లో పెంపుడు కుక్క సైజులో ఉందని చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన అతిపెద్ద ఆలుగడ్డ ఇదేనని అంచనా వేస్తున్నారు. 2011లో బ్రిటన్‌లో దొరికిన 5 కిలోల ఆలుగడ్డ ఇప్పటివరకూ అతిపెద్దదిగా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో ఉన్నది.

A Potato Named Doug May Be The Largest Ever Unearthed

కోలిన్, డోనా క్రెయిగ్-బ్రౌన్ న్యూజిలాండ్‌లోని తోటలో కలుపు తీస్తున్న సమయంలో కోలిన్ గొడ్డలికి భారీ పరిమాణంలో ఉన్న ఒకటి తగిలింది. మొదట ఆ రాయి ఉంటుందేమో అనుకున్నారు. కానీ, లోపలినుంచి తవ్వి బయటకు తీసిన తర్వాత అది ఆలుగడ్డని తెలిసి అవాక్కయ్యారు. అదో రకమైన వింత ఫంగల్ గ్రోత్, పెద్ద పఫ్‌బాల్ అనుకున్నామని కోలిన్ చెప్పుకొచ్చాడు. ఆలుగ్డను శుభ్రంగా కడిగి పైభాగాన్ని కొంచెం రుచిచూడగా అది ఆలుగడ్డని గుర్తించినట్టు తెలిపాడు. అతిపెద్ద బంగాళాదుంపను పాత స్కేల్స్‌తో కొలవగా.. అది 17.4 పౌండ్ల బరువును కలిగి ఉందని గుర్తించారు.

సాధారణ బంగాళాదుంపల రెండు బస్తాలతో సమామని, లేదంటే ఒక చిన్న కుక్కకు సమానంగా బరువు ఉందని చెబుతున్నారు. హామిల్టన్ సమీపంలోని పొలం చుట్టూ బంగాళాదుంపలు పెరిగాయి. వింతైన ఈ బంగాళాదుంపకు డౌగ్ అని పేరు పెట్టారు. డౌగ్‌ ఆలుగడ్డను బయటకు లాగేందుకు ఒక చిన్న బండిని కూడా తయారుచేశారు. ఈ ఆలుగడ్డ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ డగ్ బంగాళదుంపను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు దరఖాస్తు కూడా చేసుకున్నామని తెలిపారు. గిన్నిస్ నుంచి తమకు ఎలాంటి అప్ డేట్ రాలేదని, దానికోసమే ఆశగా ఎదురుచూస్తున్నామని దంపతులు చెప్పుకొచ్చారు.
Read Also : Gold : 75 టన్నుల బంగారం కొన్న ఆర్బీఐ