Gold : 75 టన్నుల బంగారం కొన్న ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్‌ మీద ఫోకస్ పెట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునే క్రమంలో.. ఆర్బీఐ బంగారు నిల్వలను పెంచుకుంటోంది.

Gold : 75 టన్నుల బంగారం కొన్న ఆర్బీఐ

Rbi

RBI Gold : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్‌ మీద ఫోకస్ పెట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునే క్రమంలో.. ఆర్బీఐ బంగారు నిల్వలను పెంచుకుంటోంది. ఏడాదిలోనే మరో 75 టన్నుల బంగారం.. ఆర్బీఐ ఖజానాలో చేరింది. గతేడాదితో పోలిస్తే.. రిజర్వ్ బ్యాంక్ దగ్గరున్న బంగారు నిల్వలు 11 శాతం పెరిగాయి. ఇప్పటికే ఇండియా దగ్గరున్న 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యానికి.. ఆర్బీఐ మరింత బంగారాన్ని జోడిస్తోంది. గత 12 నెలల్లో.. 75.59 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. దీంతో.. దేశంలో ఉన్న బంగారు నిల్వలు మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆర్బీఐ దగ్గర 743.84 టన్నుల బంగారం నిల్వలున్నాయి.

Read More : Bigg Boss 5 : విలన్స్ టీం నుంచి బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్

ఇది.. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 11 శాతం ఎక్కువ. ఏడాది కిందట ఇండియా దగ్గర 668.25 టన్నుల బంగారం ఉంది. ఇండియా దగ్గరున్న బంగారం నిల్వల విలువ దాదాపు 7 వేల 150 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం 36.4 బిలియన్ డాలర్లుగా ఉన్న గోల్డ్ రిజర్వ్ విలువ.. ఇప్పుడు 37.38 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది.. 10 గ్రాముల గోల్డ్ ధర 56 వేల ఆల్ టైమ్ హైక్‌ని తాకింది. ఆ తర్వాత.. మళ్లీ  48 వేలకు పడిపోయింది. దీంతో.. గోల్డ్ వాల్యుయేషన్ భారీగా క్షీణించింది. గత రెండేళ్లలో ఆర్బీఐ దగ్గరున్న బంగారం నిల్వలు 125 టన్నులకు పైగా పెరిగాయి. దీంతో.. భారతదేశం బంగారం నిల్వల్లో.. తొమ్మిదో అతిపెద్ద దేశంగా నిలిచింది.

Read More : Drugs : వరంగల్‌లో డ్రగ్స్, ఇద్దరు యువకుల అరెస్టు

భారత్ దగ్గరున్న 743 టన్నులకు పైగా బంగారంలో.. 451 టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్స్ దగ్గర సురక్షితంగా ఉంది. దేశీయంగా 292 టన్నుల బంగారం నిల్వ ఉన్నట్లు ఫారిన్ ఎక్స్ఛేంజ్ రిజర్వ్‌‌పై ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ తెలిపింది. ప్రపంచంలో ఎక్కువ బంగారం నిల్వలున్న దేశాల్లో.. అమెరికా మొదటి స్థానంలో ఉంది. అగ్రరాజ్యం దగ్గర 8 వేల 133 టన్నుల బంగారం ఉంది. ఆ తర్వాత జర్మనీలో 3 వేల 362 టన్నులు, ఇటలీలో 2 వేల 452 టన్నులు, ఫ్రాన్స్‌లో 2 వేల 436 టన్నులు, రష్యాలో 2 వేల 295 టన్నులు, చైనాలో 1948 టన్నులు, స్విట్లర్లాండ్‌లో 1040 టన్నులు, జపాన్‌లో 846 టన్నుల బంగారం నిల్వలున్నాయి. దాదాపు 744 టన్నులతో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది.