Drugs : వరంగల్‌లో డ్రగ్స్ దందా.. ఇద్దరు యువకుల అరెస్టు

వరంగల్‌లో మాదకద్రవ్యాల మత్తు గుప్పుమంటోంది. ఇన్నాళ్లూ.. హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ దందా.. ఇప్పుడు వరంగల్ జిల్లాకు కూడా పాకింది.

Drugs : వరంగల్‌లో డ్రగ్స్ దందా.. ఇద్దరు యువకుల అరెస్టు

Warangal

Drugs Warangal : వరంగల్‌లో మాదకద్రవ్యాల మత్తు గుప్పుమంటోంది. ఇన్నాళ్లూ.. హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ దందా.. ఇప్పుడు వరంగల్ జిల్లాకు కూడా పాకింది. యూత్‌ టార్గెట్‌గా.. మత్తు మాఫియా జోరుగా డ్రగ్ బిజినెస్ నడుపుతోంది. తొలిసారిగా.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో.. కొకైన్, చరస్‌తో పాటు ఆరు రకాల మత్తు పదార్థాలు దొరికాయి. వాటన్నింటిని.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు శివ, రోహన్.. బీటెక్ చదువుతున్నారని.. పోలీసులు తెలిపారు.

Read More : T.Congress : హుజూరాబాద్ బై పోల్ హై కమాండ్ సీరియస్, నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం

గోవా నుంచి నగరానికి గుట్టుగా డ్రగ్స్​సరఫరా చేస్తూ.. ఇద్దరు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు. మూడేళ్లుగా ఎవరికీ తెలియకుండా డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు సమచారం. చదువుకునే సమయం నుంచే మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు శివ, రోహన్‌. మూడేళ్లుగా వీళ్లిద్దరూ మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేల్చారు పోలీసులు. తరుచుగా గోవాకు వెళ్లి.. అక్కడ నైజీరియన్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి తీసుకొచ్చి.. వరంగల్‌లో విక్రయిస్తుట్లు గుర్తించారు.

Read More : పూర్తిగా కోలుకున్న Sai Dharam Tej… ఫ్యాన్స్‌కు చిరంజీవి గుడ్‌న్యూస్

పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు.. డ్రగ్స్‌తో సహా.. నిందితులను పట్టకున్నారు. యువకుల నుంచి 3 లక్షల 16 వేల రూపాయల విలువ గల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 LSD ఫ్లేవర్లు, 36 మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుంచి తీసిన నూనె, గంజాయి పొడిగా చేసే పరికరం, ఒక హుక్కా కుజాతో పాటు దానికి వినియోగించే సామగ్రితో పాటు ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.