Squid Games Protest : ఉద్యోగ భద్రత కల్పించండి..”స్విడ్ గేమ్స్”వర్కర్స్ ఆందోళన

ఉద్యోగ భద్రత మరియు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కొరియా ప్రధాన కార్మిక గ్రూపు-కొరియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (KCTU)..సియోల్ డౌన్‌టౌన్‌తో సహా

Squid Games Protest : ఉద్యోగ భద్రత కల్పించండి..”స్విడ్ గేమ్స్”వర్కర్స్ ఆందోళన

Korea (1)

Updated On : October 22, 2021 / 9:26 AM IST

Squid Games Protest ఉద్యోగ భద్రత మరియు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కొరియా ప్రధాన కార్మిక గ్రూపు-కొరియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (KCTU)..సియోల్ డౌన్‌టౌన్‌తో సహా దేశవ్యాప్త ఆందోళన నిర్వహించింది.

నెట్ ఫ్లిక్స్ మెగాహిట్ “స్క్విడ్ గేమ్” సిరీస్ లోని నటుల మాదిరిగా దుస్తులు(జంప్ సూట్స్ మరియు మాస్క్ లు) ధరించి బుధవారం దక్షిణకొరియాలో కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. KCTU యూనియన్ సభ్యులు జంప్‌ సూట్‌లు ధరించి..”స్క్విడ్ గేమ్”సిరీస్ లోని నటులు ధరించిన మారదిరిగా తెల్లని వృత్తం, చతురస్రం, త్రిభుజం చిహ్నాలతో కూడిన ముసుగులు ధరించారు.

ఉపాధి కల్పన,మెరుగైన పని పరిస్థితులు కల్పించాలంటూ ” డ్రమ్స్ ప్లే” చేస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. “ఇన్ ఈక్వాలిటీ అవుట్”,”సేఫ్ యూత్ ఎంప్లాయిమెంట్” “క్వాలిటీ యూత్ ఎంప్లాయిమెంట్” అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దాదాపు 80 మంది యూనియన్ సభ్యులు స్క్విడ్ గేమ్‌ని పేరడీ చేసే దుస్తులను ధరించారు. ఇది మన సమాజం యొక్క సిగ్గుమాలిన ముఖాన్ని ఇది తీవ్రంగా వ్యంగ్యం చేస్తుందని KCTU ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కోవిడ్ -19 ఆంక్షలను ధిక్కరించారంటూ సియోల్ సిటీ గవర్నమెంట్ KCTU సభ్యులపై గురువారం పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేసింది.

ALSO READ Personal Loan On Aadhaar : మీ ఆధార్‌పై పర్సనల్ లోన్ ఇక ఈజీ.. అప్లయ్ చేసుకోండిలా!