Afghanistan : భారత్‌లో అఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయం శాశ్వతంగా మూసివేత…రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ తాజా ప్రకటన

భారతదేశంలోని అఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రాయబారి శుక్రవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి ఎదురైన నిరంతర సవాళ్ల కారణంగా నవంబర్ 23 వతేదీ నుంచి న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ రాయబారిగా చెప్పుకునే ఫరీద్ మముంద్‌జాయ్ ప్రకటించారు.....

Afghanistan : భారత్‌లో అఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయం శాశ్వతంగా మూసివేత…రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ తాజా ప్రకటన

Afghanistan embassy

Afghanistan : భారతదేశంలోని అఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రాయబారి శుక్రవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి ఎదురైన నిరంతర సవాళ్ల కారణంగా నవంబర్ 23 వతేదీ నుంచి న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ రాయబారిగా చెప్పుకునే ఫరీద్ మముంద్‌జాయ్ ప్రకటించారు.

ALSO READ : Yellow alert : పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు…ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

‘‘సెప్టెంబర్ 30వ తేదీన ఎంబసీ కార్యకలాపాలను అంతకుముందు నిలిపివేశాం, న్యూఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘానిస్థాన్ ఎంబసీ కొనసాగింపు కోసం భారత ప్రభుత్వ వైఖరి అనుకూలంగా అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎనిమిది వారాల నిరీక్షణ తర్వాత, దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు జరగలేదు’ అని అంబాసిడర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఫ్ఘాన్ దేశంలో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది.