It’s A bird..and A Plane?! : అచ్చంగా పక్షిలా ఉందే..ఎగిరే కారు..వెళదామా షి‘కారు’
అచ్చంగా పక్షిలా ఉందే..ఎగిరే కారు..వెళదామా షి‘కారు’ అనేలా ఉందీ వెరైటీ వాహనం.

Africa Startup Phractyl Design Macrobat Nvtl Birdoplane
It’s a bird… and a plane? : కారు అంటే నాలుగు టైర్లుంటాయి. రోడ్డుమీద రయ్ అంటూ దూసుకుపోతుంది. కానీ ఇది టెక్ యుగం. కాబట్టి కార్లు రోడ్లమీదే కాదు జేమ్స్ బాండ్ సినిమాల్లోలాగా గాల్లో కూడా ఎగురుతాయి. ఇలా గాల్లో ఎగిరే కార్లకు టైర్లే ఉండవు. కానీ రెక్కలుంటాయి. గాల్లో ఎరిగే కార్లు అంటూ ఎన్నో వార్తలు చూస్తుంటాం. వింటుంటాం. కానీ ఈ కొత్తరకం కారుకి చక్రాలే ఉండవ్. గాల్లో ఎగిరే కారు అని ముందే చెప్పాం కదా..మరి గాల్లో ఎగిరే కారుకు చక్రాలు ఎందుకు అనుకున్నారేమో దీన్ని తయారు చేసినవారు. అందుకే చక్రాలు కాకుండా అచ్చం పక్షిలాగా ‘రెక్కలు’అమర్చారు. ఈ కారు చూడటానికి కూడా అచ్చం పక్షిలాగానే ఉంటుంది. సో..మరి రండీ ఈ రెక్కల కారులు పోదాం షి‘కారు’..
Read more : వావ్..విమానంలా గాల్లో ఎగిరే కారు..!! Video
పక్షి ఆకారంలా ఉన్న ఈ ఎగిరే కారు ఎగిరే కారు. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే సంస్థ ఈ పక్షి కారుని డిజైన్ చేసింది. నిట్టనిలువుగా పైకి ఎగిరే ఇటువంటి కార్ల కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా గానీ వాస్తవ రూపం దాల్చింది చాలా చాలా తక్కువనే చెప్పాలి. వీటిని వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) వాహనాలంటారు.అయితే వీటీఓఎల్‌ను ఫ్రాక్టిల్ కాస్త మార్చి నియర్ వీటీఓఎల్‌గా కొత్త విమానాలకు పేరు పెట్టింది. పక్షి తన కాళ్లతో ఎలా చెట్టుకొమ్మను పట్టుకుంటుందో ఈ విమానమూ నేలపై కొంత కొద్దిపాటి ఆధారంతో నిలబడి ఉంటుంది. అచ్చం పక్షిలాగా ఉండే ఈ కారు నేలపై నిలబడితే అచ్చు పక్షి నిలబడినట్లే ఉంటుంది.
Read more : Comedy Wildlife Photography : ‘ఉడుతమ్మ సన్నాయి..కంగారుల డాన్సులు..మీనాల ఫోజులు’చూసి తీరాల్సిందే..
పక్షి గాల్లోకి ఎరిగేముందు కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎలా ఎగురుతుందో..రెక్కలు విప్పార్చుకుని ఆ తరువాత కాళ్లను వెనక్కి ఎలా ముడుకుంటుందో ఇదికూడా అలాగే ఎరుతుందట. ఈ కారు గాల్లోకి ఎగిరాక కాళ్లు లోనికి ముడుచుకుంటాయి. పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ వాహనంతో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అంటున్నారు దీన్ని తయారు చేసినవారు.
Read more :
రన్‌వే, హెలిపాడ్ వంటివేవీ దీనికి అవసరం లేదు. పైగా దీన్ని పైలట్ మోడ్‌తోపాటు రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా నడపవచ్చట. అలాగే గాల్లోకి ఎగిరాక ఎమర్జన్సీ పరిస్థితులు వస్తే..ఈ పక్షికారు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. అంతేకాదు దీంట్లో 150 కిలోల బరువు కూడా తీసుకెళ్లొచ్చు. ఈరోజుల్లో మెడిసిన్స్ తరలింపులకు డ్రోన్లు ఎలా వినియోగిస్తున్నారో తెలిసిందే. ఈక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో 150 కిలోల (330 పౌండ్లు) బరువున్న మందులు, సరుకులను దీంట్లో మోసుకెళ్లవచ్చని సదరు కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ కారు ప్రారంభ డిజైన్ సింగిల్ సీటర్ గా కనిపిస్తోంది.