Al Qaeda Leader : చనిపోయాడనుకున్న అల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు
అమెరికాలోని ట్విన్ టవర్స్ పై జరిగిన 9/11 దాడులకు శనివారం నాటికి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా...చనిపోయాడనుకున్న అల్ ఖైదా లీడర్ అయ్మాన్ అల్ జవహరీ

Al Qaida
Al Qaeda Leader అమెరికాలోని ట్విన్ టవర్స్ పై జరిగిన 9/11 దాడులకు శనివారం నాటికి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా…చనిపోయాడనుకున్న అల్ ఖైదా లీడర్ అయ్మాన్ అల్ జవహరీ తిరిగి కెమెరా ముందుకొచ్చాడు. 60 నిమిషాల నిడివి గల వీడియోలో పలు అంశాల గురించి అల్ జవహరీ మాట్లాడాడు.
అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా దళాలు మట్టుబెట్టిన తర్వాత ఈజిప్టుకు చెందిన అయ్మాన్ అల్ జవహరీ ఉగ్ర సంస్థకి నాయకుడయ్యాడు. కానీ, ఒకప్పటిలా ప్రపంచాన్ని గడగడలాడించలేకపోయింది అల్ ఖైదా. ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిన తర్వాత అల్‌ఖైదా బాధ్యతలు తీసుకున్న జవహిరి.. చాలాకాలంగా అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్నాడు.
READ 9/11 Terror Attack : విమాన ప్రయాణాన్ని మార్చేసిన 9/11 ఘటన
గతేడాది నవంబర్‌లో అయ్మాన్ అల్ జవహరీ అనారోగ్యంతో మరణించినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్ని తప్పని నిరూపించేలా శనివారం అల్ ఖైదా చీఫ్ ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. శనివారం విడుదలైన ఈ వీడియోలో జవహరీ పూర్తి ఆరోగ్యంతో కనిపించాడు. 60 నిమిషాల పాటూ సాగిన ఆయన ప్రసంగం ఎప్పటిలాగే అమెరికాకి వ్యతిరేకంగా నడిచింది.
READ Afghan Govt: 9/11 రోజున జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసిన తాలిబాన్లు
9/11 దాడుల్లో పాల్గొన్న 19 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులను అయ్మాన్ అల్ జవహరీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా తన సైనికుల్ని ఉప సంహరించటంపై కూడా జవహరీ స్పందించాడు. 20 ఏళ్ల యుద్ధం తర్వాత అమెరికా పూర్తిగా కుంగిపోయి మళ్లీ ఇంటిదారి పట్టిందని అన్నాడు. అయితే, తాలిబన్లు అఫ్ఘానిస్తాన్ ని స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే జవహరి వ్యవహారంలో కొత్త అనుమానాలకి తావిస్తోంది.
కాగా, సెప్టెంబర్ 11 దాడులతో ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా నాయకులు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తల దాచుకున్నారని అమెరికా నిఘా విభాగాలు భావిస్తున్నాయి.
READ 9/11 Terror Attack : 9/11ఘటనకి 20ఏళ్ళు అవుతున్నా..ఇంకా కొనసాగుతున్న అవశేషాల గుర్తింపు