అమెరికాకు 5లక్షల కరోనా కిట్లను విరాళంగా ఇచ్చిన Alibaba 

అమెరికాకు 5లక్షల కరోనా కిట్లను విరాళంగా ఇచ్చిన Alibaba 

Updated On : March 13, 2020 / 8:55 PM IST

ఈ కామర్స్ దిగ్గజం ‘అలీబాబా’ సహ వ్యవస్థాపకుడు జాక్ మా.. 5లక్షల కరోనా టెస్టు కిట్లను, పది లక్షల ఫేస్ మాస్క్‌లను అమెరికాకు విరాళంగా ఇచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇలా ప్రకటించాడు.

‘నా దేశంలో జరిగిన ఘటన నుంచి తెలుసుకున్నా. వైద్యులు త్వరగా, కచ్చితంగా కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు టెస్టు కిట్లను అందజేస్తున్నాను. ఏ మేరకు ఉందో తెలుసుకోలేకపోతే దీనిని ఎదుర్కొనడం కష్టం’ అని జాక్ మా వెల్లడించారు.  

చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ సీనెట్‌కు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. టెస్టు కిట్ల కొరత కారణంగా వైరస్ వ్యాప్తిని కనుగొనడం కష్టంగా మారిందని ఇటీవల అమెరికా చెప్పింది. గురువారానికి అమెరికాలో 12వందల కరోనాకేసులు నమోదుకాగా, 36మంది చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. 

అమెరికా మొత్తం 13వేల మందికి టెస్టులు నిర్వహించారు. సీడీసీ డైరక్టర్ డా.రాబర్ట్ రెడ్ ఫీల్డ్ మాట్లాడుతూ.. అమెరికన్లందరూ ఫ్రీగా టెస్టులు చేయించుకోవచ్చని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 5వేలకు చేరింది. లక్షా 36వేల కేసులు నమోదయ్యాయి. మార్చి 11న వరల్డ్ హెల్ ఆర్గనైజేషన్ (WHO) కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. (Coronavirus గురించి ఈ అపోహలు మర్చిపోండి)