మాస్క్ పెట్టుకోమన్నందుకు గార్డుని 27సార్లు కత్తితో పొడిచిన అక్కాచెల్లెళ్లు

  • Published By: nagamani ,Published On : October 29, 2020 / 12:07 PM IST
మాస్క్ పెట్టుకోమన్నందుకు గార్డుని 27సార్లు కత్తితో పొడిచిన అక్కాచెల్లెళ్లు

Updated On : October 29, 2020 / 12:40 PM IST

America : ఈ కరోనా సమయంలో మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పినవారిపై కొంతమంది దాడులకు పాల్పడిన ఘటన గురించి విన్నాం. సామాజిక బాధ్యత గురించి చెబితే భౌతిక దాడులకు దిగిన ఎన్నో సందర్భాల గురించి విన్నాం. కానీ మాస్క్ పెట్టుకోమని చెప్పిన పాపానికి ఓ వ్యక్తి పాపం ప్రాణాలు కోల్పోయిన ఘటన యూఎస్ లోని చికాగో నగరంలో గత ఆదివారం (అక్టోబర్25,2020) చోటుచేసుకుంది.


మాస్క్ పెట్టుకోమని ఇద్దరు యువతులకు ఓ గార్డు సూచించాడు. అంతే ఆ గార్డులో ఆ ఇద్దరు యువతులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కత్తితో ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 27 సార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచారు.



వివరాల్లోకి వెళితే..అమెరికాలోని చికాగో నగరానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ షూ షాప్ కు వచ్చారు. వారు మాస్కులు పెట్టుకోకుండా ఉండటం గమనించిన సెక్యూరిటీ గార్డు వారిద్దరినీ మాస్కులు పెట్టుకోవాలని సూచించాడు.దీంతో రెచ్చిపోయిన 21 ఏళ్ల జెస్సికా 18 ఏళ్ల జైలాహిల్ అనే అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఆ సెక్యూరిటీ గార్డుపై ఓ పదునైన చాకుతో దాడికి పాల్పడ్డారు. జయల గార్డు జుట్టు పట్టుకుని వెనక్కి లాగగా జెస్సికా అతన్ని పొడిచి గాయపరించింది.


అత్యంత దారుణంగా 27 సార్లు పొడిచారు. తీవ్ర రక్తస్రావంతో రక్తపు మడుగులో కొట్టుకుంటున్న గార్డును చూసిన వారు పోలీసులకు సమాచారం అందించాగా హుటిహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాళ్లను జెస్సికా, జైలాగా గుర్తించారు. వీరిని వెంటనే అరెస్టు చేసి..గాయపడిన సెక్యూరిటీ గార్డుకు చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. కాగా అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.


ఈ కేసులో సదరు అక్కాచెల్లెళ్లను అరెస్టు చేసిన పోలీసులు కుక్ కౌంటీలోని సర్క్యూట్ కోర్టులో మంగళవారం ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి మేరీ సి. మారుబియో మాట్లాడుతూ ఇది హత్యాయత్నమని విచారణ విచారణ కొనసాగుతుందని వారికి బెయిల్ ఇవ్వకుండా కష్టడీకి తరలించాలని ఆదేశించారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నారని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.