భారత విమానాన్ని అడ్డుకున్న పాక్ యుద్ధ విమానాలు

కాబుల్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న సైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను పాక్ యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. 120 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని దాదాపు గంట సేపు దారివ్వకుండా అడ్డగించాయి. సెప్టెంబరు 23న జరిగిన ఘటనను డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అక్టోబరు 17న వెల్లడించింది.
డీజీసీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయింగ్ 737విమానం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి చేరుకోగానే గందరగోళం నెలకొంది. స్పైస్ జెట్ విమానం.. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను తక్కువ ఎత్తులో ఎగరాలంటూ కోరింది. ఇది కమర్షియల్ విమానం అని తెలియజేసింది.
అఫ్ఘనిస్తాన్‌లోని కాబుల్ ప్రాంతానికి చేరేవరకూ పాక్ యుద్ధ విమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. విషయం బయటకు తెలిస్తే పరిస్థితులు వేడెక్కుతాయనే కారణంతో గోప్యంగా ఉంచింది విమాన యాజమాన్యం. పాకిస్తాన్ తన గగనతలంపై జైషే మొహమ్మద్ ఉగ్రదాడి తర్వాత నుంచి నిషేదం విధించింది. ఫిబ్రవరి 26న బాలాకోట్ లోని ఉగ్రవాద క్యాంపులపై భారత ఎయిర్ ఫోర్స్ బలగాలు దాడి చేశారు.