Guinness World Record : ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన ఈ వస్తువు ఏంటో కనిపెట్టగలరా?
ప్రపంచంలో అత్యంత చిన్న వస్తువులు చాలా ఉన్నాయి. వాటి పేరు మీద అనేక రికార్డులు ఉన్నాయి. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించిన ఫోటోలోని వస్తువు ఏంటో కనిపెట్టండి.

Guinness World Record
Guinness World Record : అత్యంత చిన్న వస్తువులు తయారు చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ప్రపంచంలోనే అతి చిన్న చెక్క చెంచాను తయారు చేసి భారతీయ కళాకారుడు శశికాంత్ ప్రజాపతి ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టాడు. చెక్కతో చెంచాలు తయారు చేయడం సులభమే. అతి చిన్న చెక్క చెంచా తయారు చేయడమే కష్టమైన పని. దానిని అతను ఎలా తయారు చేశాడు? అంటే..
shortest escalator : ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్‌కు గిన్నిస్ రికార్డ్
బీహార్‌కు చెందిన 25 సంవత్సరాల ఆర్టిస్ట్ శశికాంత్ ప్రజాపతి ప్రపంచంలోనే అతి చిన్న వుడెన్ స్పూన్ తయారు చేసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 2022 లో నవరతన్ ప్రజాపతి మూర్తికర్ నెలకొల్పిన 2 మిమీ (0.07 అంగుళాలు) రికార్డును అధిగమిస్తూ శశికాంత్ ప్రజాపతి కేవలం 1.6 మిమీ (0.06 అంగుళాలు) ఉన్న స్పూన్ తయారు చేసి పాత రికార్డును తిరగరాశాడు.
Highest Living Elephent : 103 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏనుగు .. వత్సలను వరించనున్న గిన్నిస్ రికార్డు
ప్రపంచ రికార్డ్స్ బద్దలు కొట్టిన తరువాత శశికాంత్ ప్రజాపతి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో మాట్లాడుతూ చూడటానికి ఎంతో ముచ్చట గొలుపుతున్న ఈ వుడెన్ స్పూన్ తయారు చేయడానికి తను చాలా కష్టపడినట్లు చెప్పాడు. తయారు చేస్తున్నప్పుడు చాలాసార్లు ఫెయిలయ్యాడట. 99% పూర్తయ్యాక విరిగిపోయిందట. మళ్లీ మొదటి నుంచి తయారు చేయాల్సి వచ్చిందట. 2020 లో పెన్సిల్ లెడ్ నుంచి అత్యధిక చైన్ లింక్‌లను చెక్కినందుకు శశికాంత్ ప్రజాపతి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ సాధించాడు. 2020 లో మొత్తం 126 లింక్‌లతో.. 2021 లో 236 లింక్‌లతో ఈ రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో 617 లీడ్ లింక్‌లను చెక్కడం ద్వారా ఇండియాకు చెందిన కవియరసన్ సెల్వం శశికాంత్ ప్రజాపతి రికార్డును అధిగమించాడు.