Angelina Jolie: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై యువతి హృదయ విదారక లేఖ!
ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ దేశం నుండి వచ్చే విమానాలకు వేలాడుతున్న అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుకునేందుకు సిద్దపడుతున్నారు కానీ...

Angelina Jolie
Angelina Jolie: ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ దేశం నుండి వచ్చే విమానాలకు వేలాడుతున్న అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుకునేందుకు సిద్దపడుతున్నారు కానీ తాలిబన్ల పాలనలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు హృదయవిదారకంగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే మరోవైపు తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. ఇప్పటికే మహిళలు, బాలికల పట్ల మత తత్వం పేరిట తాలిబన్లు దాష్టికం మొదలుపెట్టారు.
కాగా, అక్కడి పరిస్థితిపై ఓ యువతి హృదయ విదారక లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికన్ నటి, ఆస్కార్ విజేత ఏంజెలీనా జోలీ ఈ లేఖను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో నివసించడానికి భయపడే ఒక యువతి ఈ హృదయ విదారకమైన లేఖను పంపినట్లుగా ఏంజెలీనా చెప్పింది. ఈమధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన ఏంజెలీనా.. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాథమిక మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారి గొంతును వినిపించడమే తన లక్ష్యమని చెప్పింది.
View this post on Instagram
తన మొదటి పోస్ట్‌లో ఏంజెలీనా ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ టీనేజ్ అమ్మాయి నుండి వచ్చిన లేఖను పంచుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో నివసించడానికి అక్కడి వారు ఎంతగా భయపడుతున్నారో ఆ లేఖలో తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు సోషల్ మీడియా లాంటి స్వేచ్ఛను కోల్పోతున్నారని.. తమ సమస్యలు ఇకపై ప్రపంచానికి కూడా తెలియవని.. కానీ ఇకపై వారి గొంతును ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికే ఇన్‌స్టాగ్రామ్‌లో తనపనిగా ఏంజెలీనా చెప్పింది.
కాగా, టీనేజ్ అమ్మాయి రాసిన ఆ లేఖలో.. తమ దేశాన్ని పట్టి పీడిస్తున్న భయం, ఆందోళన గురించి తెలియజేయగా.. ఆఫ్ఘన్‌లు మళ్లీ తాలిబన్ల పాలనను చూడటం బాధాకరమని.. దీని కోసం ఇరవై ఏళ్ల సమయాన్ని, డబ్బు ఖర్చు చేయడం వృధా అని తెలిపింది. రక్తపాతం, ప్రాణత్యాగాలు అన్నిటికి విలువలేకుండాపోగా.. అవే ఇప్పటి పరిస్థితికి మరో కారణంగా మారిందేమో అనిపించేలా ఉందని.. ఇక్కడి పరిస్థితిని ప్రపపంచం అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యమని యువతి లేఖలో పేర్కొంది.