Any Attack On Our Forces And Biden's Warning To Taliban
Biden warn Taliban : అప్ఘానిస్తాన్‌లో అమెరికా మిషన్ కంప్లీట్ అయింది. మా బలగాలను ఉపసంహరించుకున్నాం.. ఇక మిగిలింది.. కాబూల్ విమానాశ్రయంలో తరలింపు కార్యకలాపాలు మాత్రమే.. అందుకోసం మా అమెరికా సైనిక బలగాలు మోహరించాయి. ఈ పరిస్థితుల్లో జో బైడెన్ తాలిబన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపు కార్యకలాపాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా లేదా అమెరికా బలగాలపై ఏ దాడి చేసినా సహించేది లేదని తాలిబన్లను బైడెన్ హెచ్చరించారు. తాలిబన్లు తోక జాడిస్తే తాట తీస్తామన్నారు. అమెరికా అత్యంత వేగంగా స్పందిస్తుందని, తీవ్ర పరిణామాలు తప్పవని అన్నట్టుగా బైడెన్ తాలిబన్లకు హెచ్చరికలు జారీ చేశారు.
అప్ఘాన్ ప్రాంతంలోని మిత్రదేశాలతో సన్నిహిత సమన్వయంతో తీవ్రవాదుల ఏరివేత మిషన్ పై దృష్టి పెట్టి ఉంచామని బైడెన్ పునరుద్ఘాటించారు. అఫ్ఘనిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలతో సహా విమానాశ్రయం లేదా దాని చుట్టూ ఏదైనా తీవ్రవాద ముప్పు ఉందో లేదో ఎప్పటికప్పుడూ అమెరికా స్కాన్ చేస్తోందన్నారు. విమానాశ్రయంలో తాలిబన్లు ఏదైనా దాడికి తెగబడినా లేదా మా బలగాలపై దాడి చేసినా.. ఎయిర్‌పోర్టులో మా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినా సహించేది లేదు’ అని బైడెన్ స్పష్టం చేశారు.
FB Post: అమెరికాలో ఎక్కువగా చూసిన ఫేస్‌బుక్ పోస్టు ఇదే.. మన భారతీయ గురూజీనే టాప్
అమెరికా, తన మిత్రదేశాలపై ఉగ్రవాద దాడిని నిరోధించడంలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అలాగే అఫ్ఘనిస్తాన్ స్థావరంగా తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించే వ్యూహాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ నాటో మిత్రులతో సమావేశమైనట్టు బైడెన్ చెప్పారు. ఇందులో భాగంగానే అధ్యక్షుడు బైడెన్ గత కొన్ని రోజులుగా బ్రిటన్, జర్మనీ ఫ్రాన్స్‌లోని తన సహచరులతో చర్చలు జరుపుతున్నారు.
వైట్ హౌస్ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘మేమంతా సమావేశం కావాలని నిర్ణయించాం. వచ్చే వారం G7 సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలోని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల నేతలు హాజరుకానున్నారు. తద్వారా అఫ్ఘనిస్తాన్‌పై ఐక్య విధానం ముందుకు తీసుకెళ్తాం’ అని అన్నారు. అఫ్ఘనిస్తాన్‌లో సైన్యం ఉపసంహరణ వెనుక అమెరికా రక్షణను బైడెన్ మరోసారి పునరుద్ఘాటించారు. అక్కడ అల్ ఖైదాను మట్టుబెట్టిన తర్వాత అమెరికా తన మిషన్ పూర్తి చేసిందని పేర్కొన్నారు.
అల్ ఖైదాను మట్టుబెట్టడంలో అఫ్ఘనిస్తాన్‌లో అల్ ఖైదాను మట్టుబెట్టడంతో పాటు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అఫ్ఘనిస్తాన్ వరకు వెళ్లాం.. అక్కడే లాడెన్ ను అంతమొందించామని బైడెన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఈ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందన్నారు. గత 20 ఏళ్లలో ఈ యుద్ధ వ్యయం అంచనాలకు మించిపోయిందన్నారు. రోజుకు 150 మిలియన్ డాలర్ల నుంచి 300 మిలియన్ల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.
Afghanistan : తాలిబన్లకే వణుకు పుట్టిస్తున్న అమృల్లా సలేహ్ ఎవరో తెలుసా