FB Post: అమెరికాలో ఎక్కువగా చూసిన ఫేస్‌బుక్ పోస్టు ఇదే.. మన భారతీయ గురూజీనే టాప్
ఫేస్‌బుక్‌లో ఏయే పోస్టులను ఎంతమంది చూస్తున్నారో రివీల్ చేస్తోంది సోషల్ మీడియా కంపెనీ. అత్యధికంగా చూసే మోస్ట్ వ్యూయిడ్ కంటెంట్ ఎవరిదో చెప్పేస్తోంది.

Facebook Reveals The Most Viewed Content In Us (1)
Facebook Reveals the Most Viewed Content in US : ఫేస్‌బుక్‌లో ఏయే పోస్టులను ఎంతమంది చూస్తున్నారో రివీల్ చేస్తోంది సోషల్ మీడియా కంపెనీ. అత్యధికంగా చూసే మోస్ట్ వ్యూయిడ్ కంటెంట్ ఎవరిదో చెప్పేస్తోంది. ఫేస్‌బుక్ తమ న్యూస్ ఫీడ్‌లో ఏం చూస్తారు.. ఏయే కంటెంట్ ఎక్కువగా ప్లాట్‌ఫారమ్‌లో చూస్తున్నారు.. డొమైన్‌లు, లింక్‌లు, పేజీలు పోస్ట్‌లకు సంబంధించి జాబితాను అందించడమే లక్ష్యమని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాదిలో ఫేస్‌బుక్ రైట్ వింగ్ క్యాంపెయిన్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అన్నింటికి చెక్ పెడుతూ Facebook ఎంగేజ్ మెంట్ ట్రాక్ చేసే టూల్ తీసుకొచ్చింది.
యూజర్లకు ఎలాంటి కంటెంట్ అందించాలనే ప్రయత్నంలో భాగంగా తన మొదటి త్రైమాసిక నివేదికను రిలీజ్ చేసింది. ప్రత్యేకించి అమెరికాలో ఏయే ఫేసుబుక్ పోస్టులను అత్యధికంగా చూశారో వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులపై జుకర్ బర్గ్ కంపెనీ ఈ జాబితాను రూపొందించింది. అందులో మన భారతీయ గురూజీని టాప్ ర్యాంకులో నిలిచారు. ఆయన ఎవరో కాదు.. భారతీయ మోటివేషనల్ స్పీకర్, అధ్యాత్మిక గురువు గౌర్ గోపాల్ దాస్.. అమెరికాలో అత్యధికంగా ఈయన పెట్టిన పోస్ట్‌నే చూశారట. దాంతో గోపాల్ దాస్ ఫేస్ బుక్ పోస్ట్ మొదటి ర్యాంకులో నిలిచారు.
ఫేస్‌బుక్‌లో గోపాల్ దాస్.. అక్షరాల పజిల్‌ను పోస్ట్ చేశారు. దాస్ పోస్ట్‌లో వైరల్ ఇమేజ్ కూడా ఉంది. అందులో 3 పదాలను గుర్తించాలన్నారు. ఆయన పోస్టు చేసిన యూజర్లు మొదటి మూడు పదాలే జీవిత సత్యాలుగా పేర్కొన్నారు. గ్రాటిట్యూడ్ (సంతోషం), చేంజ్ (మార్పు), కనెక్షన్ (బంధం) అనే పదాలు ఉన్నాయని చెప్పారు. ఈ పోస్ట్‌కు 7 మిలియన్లకు పైగా కామెంట్లు, 1.1 మిలియన్ రియాక్షన్స్, 394k షేర్‌లు వచ్చాయి. (facebook.com/1885066628300379)
ఆ తర్వాత అత్యధికంగా చూసిన మరో ఫేస్ బుక్ పోస్టు మ్యుజిషియన్ ఏస్ గుత్తా.. రెండో ర్యాంకులో నిలిచారు. గుత్తా పోస్టులో తన ఫాలోవర్లకు ఒక సవాల్ విసిరారు. అందులో ఎవరైతే వయస్సు మీరినా ఇప్పటికీ యవ్వనంగానే కనిపిస్తున్నామనే వారు తమ ఫొటోలను షేర్ చేయాలని కోరారు. ఈయన పెట్టిన పోస్టుకు 4.9 మిలియన్లకు పైగా కామెంట్లు, 87k షేర్లు, 687k రియాక్షన్స్ వచ్చాయి. (facebook.com/1705381852983290).
ఆ తర్వాతి స్థానంలో Daytime అనే వ్యక్తి తన కిమ్‌బర్లీ & ఎస్టెబాన్ పేజీ (Kimberly & Esteban)లో ఫేస్‌బుక్ ఒక ఆకర్షణీయమైన పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఎంత ఆకలితో ఉన్నా వారు ఎన్నటికీ తిననిది ఏమిటి అని ఒక ప్రశ్న అడిగారు. దీన్ని 58.6 మిలియన్లకు పైగా మంది చూశారు. (facebook.com/1420970424928556).
అమెరికాలో అత్యధికంగా చూసిన ఆరవ ఫేస్‌బుక్ పోస్ట్ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పోస్టు.. 100 రోజులు పూర్తయింది.. అమెరికా తిరిగి ట్రాక్‌లో పడుతోంది అంటూ ఆయన ఏప్రిల్ 29న ఈ పోస్ట్ షేర్ చేశారు. Facebook డేటా ప్రకారం.. బైడెన్ పోస్టుకు 52.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. (facebook.com/10158165839776104).