New Covid Drugs : అమెరికాలో ఒమిక్రాన్ విజృంభణ.. కేసుల పెరుగుదలతో కొవిడ్ కొత్త డ్రగ్స్ కొరత..!
అమెరికాలో కరోనా వైరస్ మూడో వేవ్ విలయతాండవం చేస్తోంది. రెండేళ్ల రికార్డులను అధిగమిస్తూ రెట్టింపు సంఖ్యలో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి.

As Omicron Spreads Across Us, New Covid Drugs In Short Supply
New Covid Drugs : అమెరికాలో కరోనా వైరస్ మూడో వేవ్ విలయతాండవం చేస్తోంది. రెండేళ్ల రికార్డులను అధిగమిస్తూ రెట్టింపు సంఖ్యలో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే కోవిడ్ రోజువారీ మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కొవిడ్ పాత వేరియంట్ల కంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో గురువారం ఒక్కరోజే ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 5లక్షల 80 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్టు గణాంకాలు వెల్లడించాయి. అమెరికాలో ఇప్పటివరకు మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 5.5 కోట్లు దాటేసింది. కరోనా మృతుల సంఖ్య దాదాపు 8.46లక్షలకు చేరిందని రికార్డులు చెబుతున్నాయి.
అమెరికాలో ఒమిక్రాన్ వ్యాప్తితో.. కొవిడ్ కొత్త డ్రగ్స్ చికిత్సలు మొదలయ్యాయి. న్యూయార్క్ సహా ఇతర నగరాల్లోని ఫార్మసీల్లో కొత్త కొవిడ్ మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ కొత్త కొవిడ్ డ్రగ్స్ సరఫరాలో కొరత ఏర్పడిందని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కొత్త కొవిడ్ డ్రగ్స్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఒమిక్రాన్ బారిన పడివారే సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ఈ కొత్త వేరియంట్ మునుపటి స్ట్రెయిన్ల కంటే తక్కువ ప్రమాదకరమైనదిగా కనిపిస్తున్నప్పటికీ.. కేసుల సంఖ్య ఆరోగ్య వ్యవస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.
Paxlovid and Merck & Co సంయుక్తంగా అభివృద్ధి చేసిన molnupiravir డ్రగ్.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆమోదం లభించింది. అయితే ఈ డ్రగ్ కేవలం నాన్-హాస్పిటలైజ్డ్ హై-రిస్క్ పేషెంట్‌లకు, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా అడ్డుకోగలదు. ఇప్పటివరకు, Regeneron Pharmaceuticals Inc. Eli Lilly & Co. అనే రెండు ఫార్మాలు ఆమోదించిన యాంటీబాడీ థెరపీల కన్నా ఈ కొత్త డ్రగ్స్ (sotrovimab) ఒమిక్రాన్ వేరియంట్‌పై మెరుగ్గా పనిచేస్తుందని గుర్తించారు. ప్రస్తుతానికి ఈ కొత్త కొవిడ్ డ్రగ్స్ (sotrovimab)కు సరఫరాలో కొరత ఏర్పడింది.
అమెరికాలో భారీగా తగ్గిన కొవిడ్ డ్రగ్ సరఫరా..
సోట్రోవిమాబ్, ఓమిక్రాన్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేసే ఏకైక మోనోక్లోనల్ యాంటీబాడీగా పేరొంది. ప్రస్తుతం ఈ డ్రగ్ సరఫరా భారీగా తగ్గిపోయింది. GlaxoSmithKline Plc, Vir Biotechnology Inc సంస్థల నుంచి అందాల్సిన డ్రగ్ సరఫరా కూడా రాబోయే వారాల్లో నిలిచిపోయే అవకాశం ఉందని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జారీ చేసిన మార్గదర్శకాలలో ఒమిక్రాన్ తీవ్రమైన కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నా ఆస్పత్రిలో చేరే అవకాశం తక్కువగానే ఉందని పేర్కొంది.
బాధితుల చికిత్సకు కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. యూఎస్ మార్గదర్శకాల ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాలని సూచించింది. Molnupiravir జన్యుపరమైన లోపాలను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. FDA అనేది 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో లేదా గర్భిణీల్లో ఈ కొత్త కొవిడ్ డ్రగ్స్ ఉపయోగించకూడదని సిఫార్సు చేసింది. ప్రస్తుతానికి.. కొత్త కొవిడ్ డ్రగ్స్ చాలా హైరిస్క్ కలిగిన బాధితుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. డ్రగ్స్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డ్రగ్ అథారిటీ వెల్లడించింది. ఫెడరల్ ఒప్పందం ప్రకారం.. 2021లో కేవలం 1 లక్ష 80వేల మందికి Paxlovid డ్రగ్స్ అవసరం పడుతోందని, కానీ, వచ్చే ఏడాది మిలియన్ల మందికి కొత్త కొవిడ్ డ్రగ్ సరిపోతుందని భావిస్తోంది.
ఫైజర్‌తో ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ గురువారం పాక్స్‌లోవిడ్‌ను (సుమారు 100,0000 ట్యాబ్లెట్లు) మొదటి షిప్‌మెంట్‌ను అందుకుంది. ప్రారంభ డేటా ప్రకారం.. ఈ డ్రగ్ దాదాపు 90శాతం ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. molnupiravir కూడా ప్రభావవంతమైనదిగా పేర్కొంది. అలాగే ఈ డ్రగ్.. ఆసుపత్రిలో చేరడం లేదా మరణించే ముప్పును దాదాపు 30శాతం తగ్గిస్తుందని నివేదిక వెల్లడించింది. అమెరికాలో కొత్త కొవిడ్ మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. కానీ, రాబోయే వారాల్లో సెలవుల అనంతరం డ్రగ్స్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అక్కడి డ్రగ్ సరఫరా అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : AP Covid -19 : ఏపీలో కరోనా..24 గంటల్లో 166 మందికి కరోనా…91 మంది డిశ్చార్జ్