Ocean In Interior Earth : భూ అంతర్భాగంలో భారీ సముద్రం.. 660 కి.మీ లోతులో..
ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమిపైన కాదు.. భూ అంతర్భాగంలో కొనుగొన్నారు. భూమి లోతు పొరల్లో సముద్రం దాగి ఉన్నట్లు తేల్చారు.

ocean in interior of the earth (1)
Ocean In Interior Earth : ఒక వంతు భూమి మూడు వంతుల నీరు ఉన్న సంగతి తెలిసిందే. ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమిపైన కాదు.. భూ అంతర్భాగంలో కొనుగొన్నారు. భూమి లోతు పొరల్లో సముద్రం దాగి ఉన్నట్లు తేల్చారు. భూమిపై నీరే 70 శాతం ఉన్న విషయం తెలిసిందే.
ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఇన్స్‌టిట్యూట్ ఎట్ గోతే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. భూ అంతర్భాగంలో చాలా హెచ్చు స్థాయిలో నీరు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడించారు. భూ ఉపరితలానికి సుమారు 660 కిలోమీటర్ల లోతులో ఆ నీరు ఉన్నట్లు గుర్తించారు.
13th Century Fort: భూమిలోపల భారీ కోట: అరుణాచల్ ప్రదేశ్‌లో తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దపు కోట
రామన్ స్పోక్ట్రోస్కోపీ, ఎఫ్‌టీఐఆర్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. భూ ఉపరితలం, భూ లోపలి పొరల మధ్య ప్రాంతంలో కావాల్సినంత నీరు ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ట్రాన్‌సిషన్ జోన్‌లో భారీ స్థాయిలో నీరు ఉన్నట్లు గుర్తించామని ప్రొ. ఫ్రాంక్ బ్రెంకర్ వెల్లడించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.