Balochistan: బలూచిస్థాన్ లో ఘోర ప్రమాదం.. ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది మృతి
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్, లాస్బెలాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్యాసింజర్ కోచ్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. లాస్బెలాలో ప్యాసింజర్ కోచ్ యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో ఓ బ్రిడ్జి పిల్లర్ ను ఢీ కొట్టిపడిపోయిందని తెలిపారు.

Balochistan
Balochistan: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్, లాస్బెలాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్యాసింజర్ కోచ్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. లాస్బెలాలో ప్యాసింజర్ కోచ్ యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో ఓ బ్రిడ్జి పిల్లర్ ను ఢీ కొట్టిపడిపోయిందని తెలిపారు.
ఆ తర్వాత ప్యాసింజర్ కోచ్ కు మంటలు అంటుకున్నాయని చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారని తెలిపారు. కోచ్ నుంచి ఓ మహిళ, ఓ చిన్నారి సహా ముగ్గురిని ప్రాణాలతో రక్షించారని చెప్పారు. కోచ్ అధిక వేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మంటలు అంటుకున్న కోచ్ లో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని, అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని వివరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చే వివరాలు తీసుకుని వాటికి డీఎన్ఏ పరీక్షలు చేసి గుర్తిస్తామని చెప్పారు. పాకిస్థాన్ లో పదే పదే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
Oral Health Care : దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం నోటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించటం అవసరమే!