Oral Health Care : దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం నోటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించటం అవసరమే!

దంతాల క్లీనింగ్‌ ను నిర్లక్ష్యంగా చేయరాదు. దంత క్షయాలు, కావిటీస్‌కు కారణమయ్యే ప్లేక్ బిల్డప్ లను దంతాల క్లీనింగ్‌ నివారిస్తుంది. తినే ఫుడ్ , తినుబండారాలలో రిఫైన్డ్ చక్కెర వాడొద్దు. ఇది మీ దంతాల ఉపరితలం మీద పేరుకుపోయి ఉండి కొత్త కొత్త డెంటల్ ప్రాబ్లమ్స్ ను సృష్టిస్తుంది.

Oral Health Care : దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం నోటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించటం అవసరమే!

Oral Health Care :

Updated On : January 29, 2023 / 12:47 PM IST

Oral Health Care : దంత సంరక్షణ అనేది మీ రోజువారి షెడ్యూల్‌లో ఒక సాధారణ భాగంగా చేసుకోవడం ముఖ్యం. నోటి ఆరోగ్యం మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు దోహదపడుతుంది. నోటి ఆరోగ్యం అన్నది శరీరంలోని ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు దంత క్షయం మరియు చిగుళ్ల వ్యాధితో ముడిపడి ఉంది. అందుకే మీ నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా నోటి ఆరోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు దానికి కొన్ని కారణాలను చర్చించే ప్రయత్నం చేద్దాం..

దీర్ఘకాలిక ఆరోగ్యం ; ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే నివారణ కీలకం. నోటి ఆరోగ్యం సక్రమంగా లేకుంటే మొత్తం శరీరం అంతటా సమస్యలతో ముడిపడి ఉంటుంది. వీటిలో హృదయ సంబంధ వ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మధుమేహం, గర్భధారణ సమస్యలు లాంటివి ఉన్నాయి. నోరు మొత్తం శరీరానికి ప్రవేశ స్థానం, నోటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ప్రధాన మార్గాలు:

1. మెత్తటి టూత్ బ్రష్‌తో రోజూ రెండుసార్లు బ్రష్ చేయండి

2. రోజువారీ ఫ్లాసింగ్

3. ఫ్లోరైడ్ ఆధారిత టూత్‌పేస్ట్‌ని ఉపయోగించడం

3. రెగ్యులర్ గా దంతాలను శుభ్రపరచడం

దంతాల క్లీనింగ్‌ ను నిర్లక్ష్యంగా చేయరాదు. దంత క్షయాలు, కావిటీస్‌కు కారణమయ్యే ప్లేక్ బిల్డప్ లను దంతాల క్లీనింగ్‌ నివారిస్తుంది. తినే ఫుడ్ , తినుబండారాలలో రిఫైన్డ్ చక్కెర వాడొద్దు. ఇది మీ దంతాల ఉపరితలం మీద పేరుకుపోయి ఉండి కొత్త కొత్త డెంటల్ ప్రాబ్లమ్స్ ను సృష్టిస్తుంది. అన్నం, స్వీట్స్ తిన్న తర్వాత నీటితో పుక్కిలించండి. ఇలా చేయకుంటే నోటిలో చక్కెర పేరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్ ఫ్లాసింగ్ , బ్రషింగ్ చేయాలి. లంచ్ తర్వాత వీలైతే ఫ్లోరైడ్ టూత్ పేస్టుతో పళ్ళు తోముకోవాలి. ఇది బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల శరీరపరమైన ఇబ్బందుల సంగతి పక్కనపెడితే చికిత్స కోసం ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నోటి ఆరోగ్యం పాటించకుంటే దంత క్షయం మరియు ఇన్ఫెక్షన్లకు గురికావాల్సి వస్తుంది. ఈ సమస్యలకు చికిత్స చేయడం చాలా ఖరీదైనది. దంత సమస్యలు చివరకు మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. నోటి ఆరోగ్యంపై దృష్టిపెట్టటం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

నవ్వడం శరీరానికి చాలా మంచిది, ఈ చిన్న శారీరక శ్రమ ఒకరి మానసిక స్థితిని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ శారీరకంగా మరియు మానసికంగా మంచి అనుభూతి చెందాలంటే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. అందమైన మెరిసే చిరునవ్వు మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీ దంతాలు మెరుగ్గా మరియు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది దంతాల తెల్లబడటం వంటి కొన్ని దంత చికిత్సలను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. క్రమం తప్పకుండా బ్రష్ చేస్తుంటే, మీరు తినే ఆహారంతోపాటు, సమతుల్య జీవనశైలిని గడుపుతూ ఉంటే మీదంతాలు ఆరోగ్యంగా, శుభ్రంగా, ఉండి సమస్యలకు తక్కువ అవకాశం ఉంటుంది.