Nightclub Fire: నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి, మరో నలుగురికి గాయాలు
క్లబ్ నుంచి కొన్ని గంటల వరకు పొగలు వచ్చాయి. గాయాలపాలైన వారిలో..

Nightclub Fire
Spain: స్పెయిన్‌లోని నైట్ క్లబ్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముర్సియాలోని థీటర్, ఫోండా మిలాగ్రోస్ పేర్లతో పిలిచే క్లబ్ లో ఈ ఘటన చోటుచేసుకుందని, సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది క్లబ్ వద్దకు వెళ్లారని చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారని వివరించారు. ఆ క్లబ్ నుంచి కొన్ని గంటల వరకు పొగలు వచ్చాయి. గాయాలపాలైన వారిలో 22, 25 ఏళ్ల మహిళలు ఇద్దరు, 40 ఏళ్ల వయసున్న వ్యక్తులు మరో ఇద్దరు ఉన్నారని అధికారులు తెలిపారు.
పొగల వల్ల వారు తీవ్ర అవస్థతకు గురయ్యారని చెప్పారు. ముర్సియా మేయర్ జోస్ బల్లెస్టా మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఇవాళ ఉదయం క్లబ్ వద్ద దాదాపు 40 ఫైరింజన్లు, 12 ఎమర్జెన్సీ వాహనాలు కనపడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Viral Video : ప్రేమ కాదు.. పిచ్చికి పరాకాష్ట.. గాళ్ ఫ్రెండ్ చేయి కొరికిన చోట అతనేం చేసాడో చూడండి