Airline Baggage : విమానంలో అదనపు లగేజీకి డబ్బు కట్టకుండా యువతి అతి తెలివి .. కట్ చేస్తే..
ఈ అమ్మాయి చూపించిన అతి తెలివికి నవ్వులపాలైంది. తోటి ప్రయాణీకులు తనను చూసి నవ్వుకున్నారని నాలాగా ఎవ్వరు చేయవద్దు అంటూ వీడియో ద్వారా తెలిపింది. అతి తెలివికి పోతే నవ్వులపాలవ్వాల్సి వస్తుందని తెలిపింది.

Australia women Airline Baggage
Australia women Airline Baggage : విమానంలో ప్రయాణించేటప్పుడు లగేజీ నిబంధనలు తగినట్లుగా ఉండాలి. అదనపు లగేజి ఉంటే దానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా అతి తెలివి ఉపయోగిందామనుకుంటే ఇదిగో ఈమెకు జరిగినట్లేగా జరుగుతుంది. అతి తెలివి ఉపయోగించిన యువతికు ఝలక్ ఇస్తు సదరు ఎయిర్ లైన్స్ భారీ ఫైన్ వేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఆడ్రియానా అనే యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి టూర్ వేసుకుంది. జాలీగా గడిపి వద్దామని పక్కా ప్లాన్ వేసుకుంది. టూర్ అంటే ఫోటోలు, వీడియోలే కాదు షాపింగ్ కూడా ఉంటుంది కదా..ఆయా ప్రదేశాల్లో నచ్చిన వస్తువులు కొంటాం. బట్టలు కూడా కొంటాం. అలా ఆమె టూర్ లో చక్కగా షాపింగ్ చేసింది. టూర్ కంప్లీట్ అయ్యాక మెల్బోర్న్ నుంచి ఆడిలైడ్ లోని తన ఇంటికి బయలుదేరింది. ఎమిలీ అల్తామురా విమానయాన సంస్థలో ప్రయాణించాలి.
ఈ క్రమంలో విమానాశ్రయంలో చెకింగ్ జరుగగా లగేజీ బరువు ఉండాల్సింనదానికంటే ఏడు కిలోల కంటే ఎక్కువగా ఉంది. కానీ ఆ లగేజ్ ను ఆమె వదులుకోదల్చుకోలేదు. అలాగని అదనంగా డబ్బులు కట్టటం ఆమెకు ఇష్టంలేదు. దీంతో ఓ ఐడియా వేసింది. అవి బట్టలేకాబట్టి తానే బట్టల్ని ధరిస్తే లగేజ్ వెయిట్ తగ్గిపోతుంది కదాని ఐడియా వేసింది. తన ఐడియాకు తానే మురిసిపోయింది. లగేజ్ వెయిట్ తగ్గించే ప్లాన్ లో భాగంగానే 5.5 కిలోల బరువుగల దుస్తుల్ని ఒంటిపై వేసేసుకుంది. అయినా లగేజీ బరువు ఉండాల్సినదానికంటే ఒక కిలో ఎక్కువగానే చూపించింది. దీంతో ఎయిర్‌లైన్స్ సదరు యువతికి 65 డాలర్ల జరిమానా విధించింది.
తనకు ఎదురైన పరిస్థితి గురించి ఆ యువతి ఏమాత్రం సిగ్గుపడకుండా ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నా లగేజీ మాగ్జిమమ్ వెయిట్ కంటే ఏడు కిలోల కంటే ఎక్కువగా ఉంది. దీంతో అదనపు లగేజీకి డబ్బు కట్టకుండా ఉండేందుకు బ్యాగ్‌లోని దుస్తుల్ని నేనే ధరించాలనుకుని చాలా బట్టల్ని వేసుకున్నా. నా ప్యాంట్ జోబులో దాదాపు ఆరు పొరలు ఉన్నాయి. వాటిలో కొన్ని టీ-షర్టులు, ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టేశా..అయినా ఫైన్ కట్టాల్సి వచ్చింది.. మమ్మల్ని చూసి అక్కడ లైన్లో నిల్చున్న వారు నవ్వుకున్నారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇలా అన్ని దుస్తుల్ని ఒంటిపై ధరించి విమానంలో ప్రయాణించడం నాకే కాదు.. తోటి ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. నాలా మీరెవరు ఇబ్బంది పడకుండా నాలా ఎవ్వరు చేయొద్దు ’అంటూ సూచించింది.