Cricket : ఆస్ట్రేలియా బెదిరింపులకు తలొగ్గిన తాలిబన్లు.. మహిళల క్రికెట్ కు అనుమతి?
ఆస్ట్రేలియా బెదిరింపులకు తాలిబన్లు తలొగ్గారు. మహిళల క్రికెట్ జట్టును కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

Cricket
Cricket : అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. మహిళలు కేవలం పిల్లలు కనడానికి అని.. వారు రాజకీయానికి పనికి రారని తాజాగా ఓ తాలిబన్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే వారు క్రీడలు ఆడేందుకు అనుమతి నిరాకరించారు. మహిళలు ఇళ్లలోనే ఉండాలన్నట్లు తాలిబన్లు తన ఉద్దేశం బయటపెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే మహిళ క్రికెట్ కి సంబందించిన వ్యవహారం తెరపైకి వచ్చింది.
అఫ్ఘాన్ మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే.. అఫ్ఘాన్ పురుషుల జట్టుతో నవంబర్ 27న జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని తాజాగా ఆస్ట్రేలియా వార్నింగ్ ఇచ్చింది. ఆస్ట్రేలియా హెచ్చరికలతో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అఫ్ఘాన్ మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇప్పటికి అవకాశం ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ అజీజుల్లా పజీ వెల్లడించారు.
దీనిపై త్వరలో క్లారిటీ ఇస్తామని తెలిపారు. అఫ్ఘాని మహిళలు కచ్చితంగా శుభవార్త వింటారని ఆయన తెలిపారు. అఫ్ఘాన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనరని, అఫ్గానీ మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ ప్రకటించిన కొద్దిరోజులకే ఫజ్లీ ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహిళల క్రికెట్ ను నిర్వీర్యం చేయరాదని అఫ్ఘాన్ను ఆస్ట్రేలియా కోరింది. ఇలా చేస్తే అఫ్ఘానిస్తాన్ పురుషుల జట్టుతో నవంబర్ లో జరగాల్సిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ రద్దు చేస్తామని తెలిపారు. అంతేకాదు త్వరలో జరగనున్న ప్రపంచ కప్ 20కి అఫ్ఘాన్ జట్టును తీసుకోవద్దని ఐసీసీకి లేఖ రాష్ట్రమని తెలిపారు. ఈ ఘాటు హెచ్చరికల తర్వాత అఫ్ఘాన్ క్రికెట్ బోర్డులో చలనం వచ్చింది.