ప్రజలకు ఉచితంగానే కరోనా వైరస్ వ్యాక్సిన్

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 08:28 AM IST
ప్రజలకు ఉచితంగానే కరోనా వైరస్ వ్యాక్సిన్

Updated On : August 19, 2020 / 10:43 AM IST

ప్రపంచాన్ని ఇంకా వణికిస్తున్న కరోనా వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలోనే ఉత్పత్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.



ఈ మేరకు ఆస్ట్రాజెనెకా కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఉన్నారు. వ్యాక్సిన్ విజయవంతమైతే..తమ దేశంలోనే ఉత్పత్తి చేసే విధంగా ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ – ఆస్ట్రాజెనెకా కంపెనీ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ నడుస్తున్నాయి. సంవత్సరం చివరి నాటికి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.



ఆస్ట్రేలియాలో మొత్తం 23 వేల 773 కేసులున్నాయి. 14 వేల 924 మంది కోలుకున్నారు. 438 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. గత 24 గంటల్లో 226 కొత్త కేసులు నమోదయ్యాయి. 7 వేల 556 యాక్టివ్ కేసులున్నాయి. 682 మంది చికిత్స పొందుతున్నారు.