Australian couple : కుక్క కోసం…రూ. 24 లక్షలతో స్పెషల్ ప్రైవేట్ జెట్!

ఆస్ట్రేలియా సన్ షైన్ కోస్టు ప్రాంతంలో టాస్ కార్బిన్- డేవిడ్ డేన్స్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఇండోనేషియాలోని బాలిలో ఓ శునకాన్ని దత్తత తీసుకున్నారు.

Australian couple : కుక్క కోసం…రూ. 24 లక్షలతో స్పెషల్ ప్రైవేట్ జెట్!

Dog

Updated On : December 12, 2021 / 11:54 AM IST

Australian couple : పెంపుడు జంతువులపై వల్లమాలిన ప్రేమ చూపుతుంటారు కొందరు. వాటికి ఏమైనా…సొంత వ్యక్తులకు అయినట్లు ఫీలవుతుంటారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటారు. ఇందుకు ఎంతైనా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇండోనేషియాలో చిక్కుకున్న కుక్క కోసం…దంపతులు ఏకంగా ప్రైవేటు జెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు రూ. 24 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

Read More: Omicron Wave : జనవరి నుంచి బ్రిటన్ లో భారీగా ఒమిక్రాన్ కేసులు!

ఆస్ట్రేలియా సన్ షైన్ కోస్టు ప్రాంతంలో టాస్ కార్బిన్- డేవిడ్ డేన్స్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఇండోనేషియాలోని బాలిలో ఓ శునకాన్ని దత్తత తీసుకున్నారు. పెంపుడు జంతువుల దిగుమతిపై ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు అమలు చేస్తుంటారు. ఆస్ట్రేలియా ఆమోదించే వరకు అక్కడే ఉంచాలని తాము నిర్ణయించుకున్నామని కార్బిన్ తెలిపారు. శునకానికి నిర్వహించిన వైద్య పరీక్షల తర్వాత..దానిని ఆస్ట్రేలియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుమతించలేదన్నారు. దీంతో దంపతులు ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. అప్పటి నుంచి దానిని రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. డబ్బు కూడా చాలానే ఖర్చు అయ్యిందని వెల్లడించారు. అందుకనే దీనికి మిలియన్ డాలర్ మంచ్ కిన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.

Read More : ABP-CVoter Opinion Poll : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..నాలుగింటిలో బీజేపీకే అడ్వాంటేజ్!

యజమానుల దగ్గరకు చేరలేక శునకం కూడా అవస్థలు పడుతోంది. క్రిస్మస్ పండుగ వరకు తమ వద్దకు వచ్చేలా వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ప్రైవేటు జెట్ విమానాన్ని అద్దెకు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు రూ. 32 వేల అమెరికన్ డాలర్లు (రూ. 24 లక్షలు) ఖర్చు అవుతున్నా..వారు వెనుకడుగు వేయలేదు. అయితే..ఖర్చును తగ్గించుకొనేందుకు జెట్ లో ఉన్న కొన్ని సీట్లను విక్రయించాలని ఆ దంపతులు భావిస్తున్నారంట. వారు అనుకున్నట్లు అన్నీ సక్సెస్ అయితే..ఇండోనేషియాలోని బాలి నుంచి మంచ్ కిన్ ను త్వరలోనే యజమానుల ఒడికి చేరనుంది.