Omicron Wave : జనవరి నుంచి బ్రిటన్ లో భారీగా ఒమిక్రాన్ కేసులు!

బ్రిటన్ లో సోషల్ గేథరింగ్స్ పై మళ్లీ ఆంక్షలు విధించకపోతే వచ్చే ఏడాది జనవరి నుండి దేశంలో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగే అవకాశముందని లండ‌న్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపిక‌ల్

Omicron Wave  :  జనవరి నుంచి బ్రిటన్ లో భారీగా ఒమిక్రాన్ కేసులు!

Uk8

Omicron Wave : బ్రిటన్ లో సోషల్ గేథరింగ్స్ పై మళ్లీ ఆంక్షలు విధించకపోతే వచ్చే ఏడాది జనవరి నుండి దేశంలో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగే అవకాశముందని లండ‌న్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపిక‌ల్ మెడిసిన్(LSHTM)ప‌రిశోధ‌కులు శ‌నివారం హెచ్చ‌రించారు. క్రిస్మస్ పండుగ కారణంగా జన సమూహాలకు అవకాశం ఎక్కువగా ఉన్నందున..ఆంక్షలు విధంచాల్సిందేనని,లేకుంటే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముందని తెలిపారు.

ప్ర‌స్తుతం యూకేలో ఒమిక్రాన్ వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంద‌ని, ఇన్‌ఫెక్ష‌న్ల రేటు చాలా ఎక్క‌వ‌గా ఉండ‌టంతో ఆస్ప‌త్రుల‌లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశోధ‌కుల‌లో ఒక‌రైన డాక్ట‌ర్ నిక్ డేవీస్ అన్నారు. యూకేలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,898కు చేరింది.

యూకే ప్ర‌భుత్వం శుక్ర‌వారం నుంచి సినిమా హాళ్లు, ప్రార్థ‌నా స్థ‌లాలు, మ్యూజియంలు, క్రీడా స్టేడియంల‌లో మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఆంక్ష‌లు విధించింది. ఇక,వ్యాక్సినేషన్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటికి కూడా..బ్రిటన్ లో స‌గ‌టున‌ కేసుల సంఖ్య‌ ప్ర‌తి 2.4 రోజుల‌కు రెట్టింపు అవుతోంది.

మరోవైపు, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్ లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఎటువంటి సంబంధం లేనివారు కూడా ఉన్నారని నాలుగు రోజుల క్రితం బ్రిటన్ ప్రతినిధుల సభకు అందించిన నివేదికలో జావిద్ పేర్కొన్నారు. దీని ద్వారా సామాజిక వ్యాప్తి ఉందని స్పష్టమవుతోందని అన్నారు. ఒమిక్రాన్​ను అడ్డుకునేందుకు తాము ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని జావిద్ స్పష్టం చేశారు.

ALSO READ ABP-CVoter Opinion Poll : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..నాలుగింటిలో బీజేపీకే అడ్వాంటేజ్!

ALSO READ Tornadoes : అమెరికాలోని 6 రాష్ట్రాల్లో టోర్నడో బీభత్సం..80కి పెరిగిన మృతుల సంఖ్య