బాగ్దాదీను హతమార్చిన వీడియో రిలీజ్ చేసిన పెంటగాన్

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 06:43 AM IST
బాగ్దాదీను హతమార్చిన వీడియో రిలీజ్ చేసిన పెంటగాన్

Updated On : October 31, 2019 / 6:43 AM IST

ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని హతామార్చిన ‘ఆపరేషన్ బాగ్దాదీ’   వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ బుధవారం (అక్టోబర్ 30)న రిలీజ్ చేసింది. మీడియా సమావేశంలో పెంటగాన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఈ వీడియోను రిలీజ్ చేసింది. సిరియాలోని ఇదిల్బీ ప్రాంతంలోని బాగ్దాదీ అబు బకర్ అల్ ఇంటిపై అమెరికా సైన్యం వైమానిక దాడులు జరిపింది.  

ఈ సందర్భంగా అమెరికా సెంట్రల్‌ కమాండ్ కమాండర్‌ కెన్నెత్‌ మెకంజీ మాట్లాడుతూ..పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తమ నుంచి తప్పించుకునే క్రమంలో అబు బకర్ ఓ సొరంగంలో దాక్కున్నాడనీ..అతనితో పాటు  అతని 12 సంవత్సరాలు వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనీ తెలిపారు.

అమెరికా బలగాలపైకి బాగ్దాదీ కాల్పులకు పాల్పడిన క్రమంలో అతను చివరికి తనను తాను పేల్చుకున్నాడన్నారు. ఈ పేలుడులో అతనితో పాటు ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు కూడా చనిపోయారరని మెకంజీ తెలిపారు. బాగ్దాదీ చనిపోయిన అనంతరం ఆ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశామని కెన్నెత్ మెకంజీ తెలిపారు. చనిపోయేముందు అబు బకర్ అల్ ఏడ్చాడని కూడా తెలిపారు.