Florida : గుంత కనబడింది..వెంటనే ఏం చేశాడో తెలుసా..వీడియో వైరల్
రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ వ్యక్తి అరటి చెట్టును నాటేశాడు. ఈ ఘటన యూఎస్ లో చోటు చేసుకుంది.

Banana
Banana Tree : చిన్న చినుకు పడితే చాలు..కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మొత్తం నీటితో నిండిపోతుంటాయి. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. దీంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. కొంతమంది ప్రభుత్వాన్ని నిరసిస్తూ..రోడ్లపై ఏర్పడిన గుంతల్లో కూర్చొవడం, అక్కడ వరి నాట్లు నాటుతూ తమ నిరసన వ్యక్తం చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇది భారతదేశంలోనే కాదు..విదేశాల్లో సైతం ఇలాంటి నిరసన చేస్తుంటారని వెల్లడైంది. అవును రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ వ్యక్తి అరటి చెట్టును నాటేశాడు. ఈ ఘటన యూఎస్ లో చోటు చేసుకుంది.
Read More : Afghan Talibans :యుద్ధ విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతున్న తాలిబన్లు
ఫ్లోరిడాలో ఓ ప్రాంతంలో భారీ గుంత పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే..అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఓ వ్యక్తి వెరైటీగా నిరసన తెలియచేయాలని అనుకున్నాడు. ఏర్పడిన గుంతలో అరటి చెట్టును పెట్టాడు. దీంతో అందరి దృష్టి దీనిపై పడింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని అలాగే వదిలేశారంట. దాని పక్కనుంచే వాహనాలు వెళుతున్నాయి. భలే ఐడియా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.