Bangladesh: బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో అవి బంద్..

Bangladesh : బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఆ టీచర్ల నియామకాన్ని రద్దు చేసింది

Bangladesh: బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో అవి బంద్..

Bangladesh

Updated On : November 4, 2025 / 1:03 PM IST

Bangladesh : బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రభుత్వ నిర్ణయాల్లో ఇస్లామిక్ ఛాందసవాదుల జోక్యం పెరిగిపోతోంది. వారి హెచ్చరికలతో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

బంగ్లాదేశ్‌లోని పాఠశాలల్లో మ్యూజిక్, నృత్యం, పీఈటీ టీచర్ల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ చర్యలను ఇస్లాం వ్యతిరేక అజెండగా అభివర్ణించిన బంగ్లాదేశ్‌లోని ఇస్లాం ఛాందసవాదులు యూనస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలల్లో కేవలం మతపరమైన ఉపాధ్యాయులనే నియమించాలని, మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతామని బెదిరింపుకు పాల్పడ్డారు.

బంగ్లాదేశ్ లోని ఇస్లాం ఛాందసవాదుల డిమాండ్ కు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తలొగ్గింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా సృష్టించిన మ్యూజిక్, పీఈటీ టీచర్ల పోస్టులను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారి మసూద్ అక్తర్ ఖాన్ ప్రకటించారు. అయితే, ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.