Real life mystery : ఆ ఇంట్లో 100 మంది ఎందుకు చిక్కుకుపోయారు?
ఓ ఇంట్లో 100 మంది చిక్కుకుపోయారు..అనగానే .. చాలా ఉత్కంఠగా అనిపిస్తుంది. అయితే వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?

Real life mystery
Real life mystery : UK లోని ప్రముఖ బ్రిటీష్ మిస్టరీ రచయిత అగాథా క్రిస్టీ పాత ఇంట్లో 100 మందికి పైగా జనాలు చిక్కుకుపోయారు. కారణం ఏంటంటే?
500 Rupees Notes : మనీ మిస్సింగ్ మిస్టరీ.. రూ.88వేల కోట్ల విలువైన 500నోట్లు ఏమయ్యాయి?
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. చాలా చోట్ల భారీ వర్షాలు, వరదలు విజృంభిస్తున్నాయి. ఇక యూకేలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యునైటెడ్ కింగ్ డమ్‌లోని డెవాన్‌లో ప్రముఖ బ్రిటీష్ మిస్టరీ రచయిత అగాథా క్రిస్టీ పాత నివాసం వద్ద 100 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. భారీ తుఫాను కారణంగా చెట్లు కూలడంతో గ్రీన్ వే ప్రాపర్టీకి వెళ్లే ప్రధాన రహదారిని మూసి వేసారు. దాంతో పర్యాటకులకు ఈ పరిస్థితి వచ్చింది. ఇక సందర్శకులంతా భవనం బయట బిజీగా కనిపించారు. టీ తాగుతూ, మైదానంలో సేద తీరారట.
Naga Statues : కృష్ణానదిలో భారీ సంఖ్యలో నాగదేవత విగ్రహాల మిస్టరీ
అయితే సోషల్ మీడియాలో జనం మాత్రం ఈ పరిస్థితిని మిస్. క్రిస్టీ క్లాసిక్ బుక్ ‘ అండ్ దెన్ దేర్ వన్ నన్’ తో పోల్చారట. ఈ పుస్తకంలో డెవాన్ తీరంలో ఓ పాడుబడిన భవనానికి పదిమందిని ఆహ్వానిస్తారట. వారిలో ఒక్కొక్కరూ చనిపోతూ ఉంటారు..అయితే హంతకుడు ఎవరనేది ఉత్కంఠగా స్టోరి కొనసాగుతుందట.. ఈ భవనంలో చిక్కుకున్న వారి పరిస్థితి అంతకంటే బాధాకరంగా ఉందని తెలుస్తోంది. ఇక రెస్క్యూ సిబ్బంది రహదారిని పునరుద్ధరిస్తే తాము తమ ఇళ్లకు చేరుకుంటామని పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. భారీ తుఫాను కారణంగా గ్రీన్ వే మూసివేయబడిందని నేషనల్ ట్రస్ట్ సైట్ సందర్శకులకు సూచనలు చేసింది.