Wagner group: ఆ విషయంలో ప్రిగోజిన్‌కు ధైర్యం చెప్పాను.. ప్రిగోజిన్, పుతిన్ మధ్య సయోధ్యను వివరించిన లుకషెంకో

పుతిన్, ప్రిగోజిన్ మధ్య సయోధ్య‌ కుదిర్చిన తీరును వివరించిన బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో వివరించారు.

Wagner group: ఆ విషయంలో ప్రిగోజిన్‌కు ధైర్యం చెప్పాను.. ప్రిగోజిన్, పుతిన్ మధ్య సయోధ్యను వివరించిన లుకషెంకో

Alexander Lukashenko

Updated On : June 28, 2023 / 12:42 PM IST

Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) పెంచిపోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవెగెనీ ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) రష్యా (Russia) పైనే తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు. వాగ్నర్ గ్రూపు (Wagner group) దూకుడు ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపింది. రష్యాలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల పాటు ఆ దేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఉన్నట్లుండి వాగ్నర్ సైన్యం తిరుగుబాటు జెండాను దింపేసి వెనక్కి వెళ్లిపోయింది. వాగ్నర్ గ్రూప్ ను అడ్డుకొనేందుకు అప్పటికే రష్యా సైన్య సన్నద్ధమైంది. ఈ రెండు వర్గాలు ఎదురుపడితే రక్తపాతం జరిగేది. కానీ వాగ్నర్ గ్రూపు వెనక్కు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వాగ్నర్ గ్రూప్ వెనక్కు తగ్గడానికి బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో కారణం. ఇదే విషయాన్ని రష్యాసైతం చెప్పింది. ప్రిగోజిన్ తో లుకషెంకో చర్చలు జరిపి వెనక్కు తగ్గేలా చేశాడు.

Wagner Group: మాకు వెన్నుపోటు పొడిచారు, వారికి చుక్కలు చూపిస్తాం.. రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపుకు పుతిన్ వార్నింగ్

తాజాగా పుతిన్, ప్రిగోజిన్ మధ్య సయోధ్య కు సంబంధించిన వివరాలను లుకషెంకో వివరించారు. వాగ్నర్ గ్రూపు తిరుగుబాటుతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భయంతో పారిపోయాడని ఆరోపణలు వచ్చాయి. పుతిన్ పనైపోయిందని చెప్పుకొచ్చారు. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో చెప్పిన వివరాలను బట్టిచూస్తే పుతిన్ వెనక్కు తగ్గడం వల్లనే ప్రిగోజిన్ బతికిపోయాడట. లేకుంటే ప్రిగోజిన్ గ్రూప్ ను పుతిన్ పురుగును నలిపేసినట్లు నలిపేసేవాడని, ఆ గ్రూపును నామరూపాలు లేకుండా చేసేవాడని లుకషంకో చెప్పారు. పుతిన్ వాగ్నర్ గ్రూపును అంతం చేసేందుకు సిద్ధమైన తరుణంలో అలెగ్జాండర్ లుకషెంకో పుతిన్‌తో మాట్లాడి నచ్చజెప్పారట.

Russia Revolt: ప్రిగోజిన్ ప్లాన్‌ను అమెరికా నిఘా సంస్థలు ముందుగానే పసిగట్టాయట.. పుతిన్‌కు ఎప్పుడు తెలిసిందంటే?

లుకషెంకో చెప్పిన వివరాల ప్రకారం.. వాగ్నర్ గ్రూపును నామరూపాల్లేకుండా చేయాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు. తొందరపడొద్దని నేను పుతిన్ ను కోరాను. ప్రిగోజిన్, అతడి కమాండర్లతో మాట్లాడమని చెప్పాను. కానీ, పుతిన్ మాత్రం చెప్పేది విను అలెక్స్. ప్రిగోజిన్ ఫోన్ తీయడు. ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడడు అని పుతిన్ నాతో చెప్పాడు. అయితే, రక్తపాతం జరగకుండా వాగ్నర్ గ్రూప్ వెనక్కు తగ్గేందుకు క్రెమ్లిన్ ఆఫర్లను ప్రిగోజిన్ కు చేరవేశాను.

ప్రిగోజిన్ సాయంత్రం సమయంలో నాకు ఫోన్ చేసి నేను మీ కండీషన్లకు అంగీకరిస్తున్నాను. కానీ, మేము ఇప్పుడు వెనక్కు తగ్గితే రష్యా సైన్యం మమ్మల్ని చంపేస్తుందని అనుమానం వెలుబుచ్చాడు. ఆ సమయంలో ప్రిగోజిన్ కు నేను ధైర్యం చెప్పాను. పుతిన్ మీ గ్రూప్ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చాను. దీంతో ప్రిగోజిన్ సేనలు వెనక్కు వెళ్లిపోయాయి అని లుకషెంకో చెప్పారు.