ఇది నిజం… 12కి పైగా దేశాల్లో ఇంత వరకు కరోనా వైరస్ సోక లేదు

  • Published By: murthy ,Published On : August 25, 2020 / 08:42 AM IST
ఇది నిజం… 12కి పైగా దేశాల్లో ఇంత వరకు కరోనా వైరస్ సోక లేదు

Updated On : August 25, 2020 / 9:55 AM IST

చైనాలో పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8నెలలు కావస్తున్నా కొన్ని దేశాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్ముతారా! అవును ఇది నిజం. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయట పడింది.



ఇప్పటికే ప్రపపంచ వ్యాప్తంగా23.5 మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డట్టు లెక్కలు చెపుతున్నాయి. ఈ వ్యాధికి టీకా కనిపెట్టటానికి దేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలు పోటీపడుతున్నాయి. చైనాలో పుట్టిన వైరస్ రూపాంతరం చెంది పలుదేశాల్లో వ్యాపించి ఆయా దేశాలను దెబ్బతీసింది. ప్రజల దైనందిన జీవితాన్ని దెబ్బతీసింది. దేశాల ఆర్దిక వ్యవస్ద పై తీవ్ర ప్రభావం చూపించింది.

కాగా ప్రపంచంలోని 12 కు పైగా దేశాలు ఇంతవరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వారంలో జరిగే రిపబ్లికన్ నేషనల్ మీటింగ్ లో మరోసారి కరోనా వైరస్ పై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కెంటకీ ఫ్రైడ్ చికెన్ తనప్రసిధ్ద క్యాచ్ ఫ్రైజ్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూఎస్ లో పరిస్ధితి ఇలా ఉంటే అసలు మావి పూర్తి కరోనా రహితమని డజన్ కు పైగా దేశాలు చెపుతున్నాయి. వాటిలో



1) Samoa-సమోవా
2) Marshall Islands-మార్షల్ దీవులు
3) Solomon Islands-సోలమన్ దీవులు
4) Vanuatu-వనాటు
5) Tuvalu-తువలు
6) Tonga-టోంగా
7) Kiribati-కిరిబాటి
8) Turkmenistan-తుర్క్మెనిస్తాన్
9) Federated States of Micronesia-ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా
10) Nauru-నౌరు
11) North Korea-ఉత్తర కొరియ
12) Palau-పలావు
13) Cook Islands-కుక్ దీవులు
14) Niue-నియు



వీటిలో చాలా వరకు దేశాలు ద్వీపాల్లో ఉండటం… మరికొన్ని రిమోట్ ఏరియాలో ఉండటం కూడా వైరస్ వ్యాప్తి చెందక పోవటానికి కారణంగా భావిస్తున్నారు. ఉత్తర కొరియాలో ఇంతవరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు……కానీ కొందరు అధికారులు మాత్రం మార్చి నెలలోనే దేశంలోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.