Israel Hamas War : భారత్ కలల ప్రాజెక్టును ఆపడానికే ఇజ్రాయెల్ పై హమాస్ దాడులకు కారణమా? జోబిడెన్ ఏమన్నారంటే

గాజాలో భూతల దాడుల్ని నిర్వహించేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే కాచుకొని ఉన్నాయి. ఇలా చేయడం వల్ల వందలాది మంది ప్రాణాలు

Joe biden

Israel Hamas War Update : ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో వందలాది మందికిపైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. ఈ దాడి తరువాత హమాస్ పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేస్తోంది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడుల్లో సామాన్యులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ పోరుపై ప్రపంచ దేశాలు తమ వైఖరిని వెల్లడిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ వైపు నిలుస్తుంటే, మరికొన్ని దేశాలు హమాస్ కు మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా .. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : Israel Hamas War : హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ఎలా ప్రవేశించారో చూశారా.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్

ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాద దాడికి ఓ కారణం ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రతిష్టాత్మకమైన ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్ ను ప్రకటించడం కూడాఅని తాను భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు బిడెన్ అన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రాంతాన్ని రైల్వే నెట్ వర్క్ కు కలుపుతుంది. అయితే, ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు లేవని, ఎక్కడో దీని వెనుక పెద్ద కారణం ఉందని నా మనస్సాక్షి ఈ విషయాన్ని నాకు చెబుతోందని అన్నారు. మేము ఈ ప్రాజెక్టును వదిలిపెట్టలేమని బిడెన్ చెప్పాడు.

Also Read : Israel Hamas War : భీకరదాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్.. హమాస్ టన్నెల్, బంకర్ నెట్ వర్క్ లే టార్గెట్

ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి కారణం ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరోప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ)ని జోబిడెన్ ఒక వారంలోపే ప్రస్తావించడం ఇది రెండోసారి. చాలా మంది ఈ ఆర్థిక కారిడార్ ను చైనా యొక్క బీఆర్ఐ ప్రాజెక్ట్ కు ప్రత్యామ్నాయంగా కూడా చూస్తున్నారు. ఇది అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా దేశాలను సంయుక్తంగా కలుపుతుంది. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా భారత్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ కారిడార్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతంతో అనుసంధానించే తూర్పు కారిడార్, మరొక భాగం గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్ తో అనుసంధానించే ఉత్తర కారిడార్.

Also Read : Israel-Hamas Conflict Horror : గాజాలో పెరిగిన మృతుల సంఖ్య, ఐస్‌క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు

ఇదిలాఉంటే.. గాజాలో భూతల దాడుల్ని నిర్వహించేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే కాచుకొని ఉన్నాయి. ఇలా చేయడం వల్ల వందలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదముందని అమెరికా ఇజ్రాయెల్ ను నిలువరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ను ఇదే విషయంపై ప్రశ్నించారు. భూతల దాడుల్ని వాయిదా వేయాలని మీరు ఇజ్రాయెల్ ను కోరుతున్నారా? అని ప్రశ్నించగా.. హమాస్ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు.