Pushing Nepal Plane : ఏంటి.. స్టార్టింగ్ ప్రాబ్లమా?.. విమానాన్ని ఎలా తోస్తున్నారో చూడండి!

సాధారణంగా ప్రయాణం మధ్యలో ప్రయాణించే వాహనం ఇంజిన్ ఆగిపోవడం లేదా టైర్ ఫంక్చర్ అయితే అది ఇబ్బంది కాదు.. నరకయాతనే.. మారుమూల ప్రాంతంలోనైతే చెప్పనక్కర్లేదు.

Pushing Nepal Plane : ఏంటి.. స్టార్టింగ్ ప్రాబ్లమా?.. విమానాన్ని ఎలా తోస్తున్నారో చూడండి!

Bizarre Video Shows Passengers Pushing Plane Off Nepal Airport Runway

Updated On : December 3, 2021 / 8:08 PM IST

Pushing Nepal Plane  సాధారణంగా ప్రయాణం మధ్యలో ప్రయాణించే వాహనం ఇంజిన్ ఆగిపోవడం లేదా టైర్ ఫంక్చర్ అయితే అది ఇబ్బంది కాదు.. నరకయాతనే.. మారుమూల ప్రాంతంలోనైతే చెప్పనక్కర్లేదు. ఆ పరిస్థితి అనుభవించేవారికి మాత్రేమే తెలుస్తుంది. అచ్చం అలాంటి సమస్యే ఎదురైంది నేపాల్ విమానానికి.. పైకి ఎగరలేని పరిస్థితి. కనీసం ముందుకు కూడా వెళ్లలేదు. విమానంలో ఎక్కినవారే బస్సు లేదా కారును తోసినట్టు ముందుకు తోయాల్సి వచ్చింది. ఇంతకి ఏమైందంటే.. ఆ విమానం టైర్ ఫంక్చర్ అయిందంట.. ఏం చేస్తారు పాపం.. లోపల కూర్చొన్నవాళ్లంతా కిందికి దిగి తలో చేయి వేసి ముందుకు తోశారు.

రన్‌వేపై నిలిచిపోయిన ఈ విమానాన్ని ఏదోలా ఎయిర్ పోర్టు రన్ వేపైకి తోసుకెళ్లారు. ఈ విమానం.. నేపాల్ కు చెందిన తారా ఎయిర్ లైన్స్‌ది.. రన్ వేపై నిలిచిన విమానాన్ని ప్యాసింజర్లు, సెక్యూరిటీ సిబ్బంది నెట్టుకుంటూ మందుకు తీసుకెళ్లారు. నేపాల్‌ జర్నలిస్ట్‌ సుషీల్‌ భట్టారాయ్‌ ప్రకారం.. టైర్‌ పేలడంతో రన్‌వేపై విమానం నిలిచిపోయింది. రన్ వేపై అలానే వదిలిస్తే.. వచ్చే పోయే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బందిని తలో చేయమన్నారు.


అందరూ కలిసి రన్ వేపై నుంచి విమానాన్ని కాస్తా పక్కకు తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చిందట.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏంటి భయ్యా.. స్టార్టింగ్ ప్రాబ్లమా? లేదా ప్యూయల్ అయిపోయిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారా? మరో యూజర్ అన్నా.. ఇదేమైనా ట్రక్కు అనుకున్నారా? అలా తోసుకుంటూ వెళ్తున్నారంటూ సరదా కామెంట్ చేయగా.. నేపాల్‌ వైమానిక అధికారులు తప్పిదమేనని అంటున్నారు. ఏంటి స్టెప్నీ లేదా అని సరదా కామెంట్ చేశారు మరో యూజర్.

Read Also : Pushpa Trailer Tease : క్యారెక్టర్లు మామూలుగా లేవుగా..! పుష్ప ట్రైలర్ టీజ్